గ్యాంగ్ లీడర్ టైటిల్ పెట్టడంలోనే  పెద్ద సాహసం కనిపిస్తుంది. 90 దశకం ఆరంభంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా అది. అప్పట్లో ఆ మూవీ కనకవర్షం కురిపించింది. ఆ మూవీ తరువాత మైటీ మెగాస్టార్ గా చిరంజీవి తన హద్దులను చెరిపేసుకుని బాక్సాఫీస్ బొనాంజా అయిపోయారు. మరి అలాంటి సూపర్ డూపర్ హిట్ అయిన గ్యాంగ్ లీడర్ టైటిల్ వేరే సినిమాకు పెట్టాలి అంటే దమ్ము ఉండాలి, తనకు ఆ దమ్ము ఉందని డైరెక్టర్ విక్రం కుమార్ నిరూపించుకున్నారు.


కధ ఎలా ఉన్నా స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో విక్రం ఆడియన్స్ ని సినిమా హాల్లో ఉండగలిగేలా చేశాడు. లాజిక్కులొద్దు నా మ్యాజిక్కు మాత్రమే చూడండంటూ  విక్రం చేసిన విన్నపానికి సగటు ఆడియన్ సరెండర్ అయ్యాడు, కనెక్ట్ అయ్యాడు. సినిమా హాల్ నుంచి వస్తే కధ ఏంటి అసలు ఇలా జరుగుతుందా అంటూ లాజిక్ పాయింట్లు ఎన్నో చెప్పుకోవాలి కానీ హాలులో ఉన్నంతసేపూ మాత్రం విక్రం మ్యాజిక్ వల్ల అటువంటి ఆలోచనే ఆడియన్  బుర్రలోకే రాదు.


ఇది నిజంగా న్యూ ట్రెండ్ గా చెప్పుకోవాలి. ఓ సినిమా గురించి మనం ఆలోచిస్తూ తెరపైన  చూడడం ఇంతవరకూ చూశాం. ఇపుడు తెర మీద వచ్చే సీన్లకు ఏ మాత్రం మన మెదళ్ళతో ఆలోచన చేయకుండా వెనక ఉంచి డైరెక్టర్ ఎలా డ్రైవ్ చేస్తే అలా మువ్ అయిపోతూ చూడడం అన్నది నిజంగా గొప్ప విధానమే. విక్రం ఈ విషయంలో ట్రెండ్ సెట్టరే మరి వచ్చిన ఆడియన్స్ ని, వారి మెదళ్ళను తన ఆధీనంలో ఉంచుకుని కదలకుండా సినిమా చూపించే టాలెంట్ విక్రం కి ఉందని ప్రూవ్ చేసుకున్నాడు.


ఇక నాని మంచి ఆర్టిస్ట్. ఆయన టాలెంట్ ని విక్రం బాగానే యూజ్ చేసుకున్నాడు. పగలు ప్రతీకార కధల్లో ఇది కూడా ఒకటి అనుకున్నా తనదైన స్క్రీన్ ప్లే స్పెషాలిటీతో విక్రం దీన్ని చూడదగ్గ సినిమాగా చేశాడు. ఈ మూవీకి కలెక్షన్లు బాగానే వస్తాయి. టాక్ కూడా బాగుంది. ఓ విధంగాచెప్పాలంటే నాని  గ్యాంగులో ఒకడు. గ్యాంగ్ లీడర్ మాత్రం డైరెక్టర్ విక్రం కుమారే.


మరింత సమాచారం తెలుసుకోండి: