బిగ్ బాస్ లో ఆలీ ఎలిమినేట్ అయినప్పటి నుండి  ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆలీ బిగ్ బాస్ హౌస్ లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని పుకార్లు వచ్చాయి. రోజు రోజుకీ ఇవి మరింతగా పెరుగుతున్నాయి. ఆలీ రీ ఎంట్రీ పక్కా అంటూ ప్రతి రోజు వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఆలీ రీ ఎంట్రీపై తాజాగా ఒక క్లారిటీ వచ్చేసింది.


ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ పెద్దగా సక్సెస్ కాలేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోవడం తప్పితే , వాళ్ళు చేసింది ఏమీలేదు. అలాగే పోయిన సీజన్ లో రీ ఎంట్రీ అట్టర్ ఫ్లాప్. రీ ఎంట్రీగా వచ్చిన నూతన్ నాయుడు, శ్యామలలు బయట ప్రభావాలకి గురయ్యి గేమ్ ని రియాలిటీగా ఆడే ప్రయత్నం చేయలేకపోయారు. ప్రతీక్షణం బయట ఏం అనుకుంటారో అన్నదాంట్లో పడిపోయి గేమ్ ని సరిగ్గా ఆడలేదు.


వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని బిగ్ బాస్ రీ ఎంట్రీని ఆక్సెప్ట్ చేసేట్టు కనిపించట్లేదు. ఇప్పటి వరకు రోహిణి, ఆషు, ఆలీలలో ఎవరో ఒకరు రీ ఎంట్రీ ఇస్తారని భావించారు. ఒకవేళ ఆలీని రీ ఎంట్రీ చేద్దామనే ఆలోచనే ఉంటే అతన్ని ఎలిమినేట్ చేయకుండా సీక్రెట్ రూంలో పెట్టి ఉండేవారు. మొదటి సీజన్ లో ముమైత్ ఖాన్ ని సీక్రెట్ రూంలో ఉంచిన విషయం తెలిసిందే. కానీ అలా జరగలేదు.


రీ ఎంట్రీ ఇచ్చిన వారి రియక్షన్స్ కృత్రిమంగా అనిపించడంతో ఇక దాని జోలికి పోవద్దని డిసైడ్ అయినట్టుగా స్పష్టంగా అర్థం అవుతుంది. దీంతో ఆలీ రీ ఎంట్రీపై వస్తున్న వార్తలకు చెక్ పడ్డట్లే. ఇంకా నలభై రోజులే ఉన్న కారణంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీకి అవకాశం లేదు. ఇక ఈ వారం నుండి ఎలిమినేషన్సే ఉంటాయి. వీలైతే డబల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: