న్యాచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం ఈ పేరు అందరి నోట్లో నానుతుంది. ఇవ్వాళ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా రిలీజ్ అయింది. మొత్తం కామెడీతో తెరకెక్కిన ఈ సినిమా గతంలో వచ్చిన చిరంజీవి సినిమా కథకు భిన్నంగా రూపొందించబడింది. చిరు సినిమా ఎంతగా సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే.కాగా , ప్రస్తుతం ఈ సినిమా కూడా మంచి టాక్ తో సాగుతుంది.

ఇకపోతే ఈ సినిమా నాని  స్టయిల్లో తెరకెక్కింది. ముందు సినిమాల్లోలాగే ఈ సినిమాలో కూడా తన కామెడీ తో అలరించారు. మొదట్లో టైటిల్ చెప్పగానే నాని గ్యాంగ్ లీడర్ అంటే నాని విలన్ గానో లేకా గ్యాంగ్ స్టర్ గానో కనిపిస్తాడని అందరు అనుకున్నారు. నాని అందరికి షాక్ ఇచ్చాడు. కథను మార్చేశాడు. విక్రమ్ కే కుమార్ తన అద్భుతమైన డైరక్షన్ తో మరో సారి రికార్డు లని కొల్లగొట్టారు. ఈ సినిమాతో నాని కామెడీని పండించడంలో మరో మెట్టు ఎక్కాడని వేరేలా చెప్పనక్కర్లేదు.

అయితే,  ఈ చిత్ర పోస్టర్ చూసి సినిమా ఫ్యామిలీ గ్యాంగ్ తో కనిపిస్తాడని అనుకున్నారు. వారి అంచనాలకు  భిన్నంగా ట్రేలర్ లో చూపించారు. ప్రస్తుతం సినిమాను చుస్తే ఈ సినిమా టైటిల్ కి తగ్గట్లు లేదు. కథకు తగ్గట్లు సినిమా లేదు కానీ నాని కామెడీతో పంచులతో ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. కధలో చాలా లోపాలున్నా కూడా కామెడీ స్థాయిని పెంచి అందరిని కడుపుబ్బా నవ్వించింది.  సినిమా మొత్తం రివెంజ్ పేరుతో చిన్నవారి నుండి పప్రతి ఒక్కొక్కరు చక్కగా నటించి అందరిని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతానికి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది .. మరి కలెక్షన్ ఏ మాత్రం పోగేసుకుంటుందో చూడాలి .. ఈ విదంగా చూసుకుంటే నాని ఖాతాలో మరో హిట్ పడినట్లే..


మరింత సమాచారం తెలుసుకోండి: