ఒకప్పుడు సినిమాలకు ముందు ముకేశ్ యాడ్ లా ఈ నగరానికి ఏమైంది. ఒక వైపు నుసి మరో వైపు పోగ ..దీనికి పాడాలి చరమగీతం అన్నట్లు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ ఈ యాడ్ ను తూచా పాటిస్తుంది. ఒకవైపు పెద్ద డైరెక్టర్లు  సినిమాలను  తెరకెక్కించిన కూడా వాటికి సరైన హిట్లు లేక వచ్చిన కొద్దిరోజులకే అవి మరుగున పడుతున్నాయి. దానితో చిన్న డైరెక్టర్లు సినిమాలు తీయాలంటే భయపడుతున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లోని ఏ పెద్ద  డైరెక్టర్ కూడా మినిమం అంటే మినిమం 100  కోట్ల బడ్జెట్ లేకపోతే సెట్స్ పైకే తీసుకెళ్లేలా కనిపించడంలేదు. 

ఏ ముహూర్తాన దర్శకదీరుడు రాజమౌళి .. ఆ బాహుబలి సినిమాని తీసాడో కానీ , ప్రతి ఒక్కరూ కూడా ఆ సినిమాని తలదన్నే సినిమాని తీయాలని అనుకోవడం ...కోట్లు ఖర్చుపెట్టి , అన్ని ఇండస్ట్రీల అగ్ర నటులతో సినిమా తీయడం చివరికి ఆ సినిమా దరిదాపుల్లోకి కూడా పోకుండా ఆగిపోవడం ఇదే గత రెండేళ్లుగా జరుగుతూనే ఉంది. ఒక్క టాలీవుడ్ అనే కాదు ..మిగిలిన సినీ ఇండస్ట్రీలు కూడా బాహుబలితో పోటీ పడి దాన్ని అందుకోలేక చతికిలపడిపొయ్యాయి. వేల కోట్ల రూపాయలతో ..మితిమీరిన ఆత్మవిశ్వాసం తో సినిమాలు చేయడం , ఆ తరువాత భారీగా నష్టాలు వచ్చాయని భాదహపడటం. ఇది చూస్తుంటే అప్పట్లో పెద్దలు చెప్పినట్టు ..చేతులు కాలాక ..ఆకులు పట్టుకొని ఏం లాభం అని అనిపిస్తుంది. 

ఇక ఈ భారీ బడ్జెట్ చిత్రాలలో సరైన కథ లేకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం రెండు , మూడురోజులకే చాపచుట్టేస్తుంది. ఎన్ని కోట్లు పెట్టినా కూడా సరైన కథ , కథనం లేకపోతే చుసేనాధుడే లేడు. ఈ భారీ బడ్జెట్ చిత్రాల ముసుగులో సరైన కథాబలంతో తెరకెక్కించిన చిన్న బడ్జెట్ చిత్రాలు తెరమరుగై పోతున్నాయి.  భారీ బడ్జెట్ చిత్రాలు కాబట్టి ..వాటికీ జరిగే ప్రమోషన్ హై  రేంజ్ లో ఉంటుంది. అలాగే వీలైనన్ని ఎక్కువ థియేటర్లు వారే లాగేసుకుంటారు. దీనికి నిదర్శనం ..గతంలో ఎటువంటి హైప్ లేకుండా వచ్చిన మంచు మనోజ్ చిత్రానికి హైదరాబాద్ సిటీ లో కేవలం ఒకే ఒక థియేటర్ ఇచ్చారు. దీనిపై మనోజ్ అప్పట్లో సినీ ఇండస్ట్రీ ప్రముఖలపై విరుచుకుపడ్డాడు. సినిమా తీయడం ఎంత కష్టమో ఆ సినిమాని అభిమానుల వద్దకి తీసుకుపోవడం కూడా అంతే కష్టం. 

సినిమా అభిమాని ... చిన్న సినిమాని అయినా , భారీ బడ్జెట్ సినిమాని అయినా కూడా ఒకే విధంగా చూస్తాడు. కానీ , ఇండస్ట్రీలోని కొందరు చిన్న చిన్న సినిమాల్ని పైకి రానివ్వకుండా తొక్కిపడేస్తున్నారు. ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన పెళ్లి చూపులు పెద్ద విజయం సాధించిన ...ఇండస్ట్రీకి విజయదేవరకొండ లాంటి స్టార్ హీరోని అందించింది. అలాగే మరో చిన్న సినిమా RX100 కూడా ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి భారీ హిట్ గా నిలిచింది. ఇక ప్రస్తుత విషయానికొస్తే ... తాజాగా ఈ రోజు నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికే పది, పదిహేను రోజులు కావాల్సింది. కానీ , ప్రభాస్ లేటెస్ట్ మూవీ సాహో రిలీజ్ ఉండటంతో నాని వాయిదా వేసుకోక తప్పదు. సాహో కోసం నాని రెండుసార్లు విడుదల డేట్స్ ని మార్చుకోవాల్సి వచ్చింది. ఇండస్ట్రీలో ఏ సినిమా అయిన ఒకే ధోరణితో చూసే రోజులు ఎప్పుడు వస్తాయో మరి...
 


మరింత సమాచారం తెలుసుకోండి: