ఈ మద్య సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యే ముందు ఎన్నో అవాంతరాలు ఎదుర్కొంటూ..కాంట్రవర్సీలు సృష్టిస్తూ మొత్తానికి థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఈ సమస్యలన్నీ ఎక్కువగా స్టార్ హీరోలకు మాత్రమే వస్తుంటాయి.  టైటిల్, కథ,సాంగ్స్ ఇతర విషయాల్లో కాపీ కొట్టారని, కొన్ని టైటిల్స్, డైలాగ్స్ తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఎన్నో వివాదలు చుట్టుముడుతుంటాయి.  తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్‌, హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతోన్న 'వాల్మీకి' అనే టైటిల్ అనౌన్స్ ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి.

అయితే  'వాల్మీకి' అనే టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి దీనిపై రక రకాల ఆరోపణలు ఆక్షేపణలు వస్తూనే ఉన్నాయి. ఈ మూవీ టీజర్, లిరిక్స్ చూస్తుంటే గ్యాంగ్ స్టర్ మూవీలా ఉందని..అలాంటి సినిమాకు వాల్మీకి అనే టైటిల్ ఎలా పెడతారని బిసీ సంఘాలు ఆక్షేపిస్తున్నాయి. వాల్మీకి సినిమా పేరునువెంటనే మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి. గతంలో బోయ సంఘాలు తమ కులానికి చెందిన వ్యక్తి పేరుని టైటిల్ గా పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ షూటింగ్ జరక్కుండా అడ్డుకున్నాయి.

కానీ, మూవీ షూటింగ్ మాత్రం ఎక్కడా ఆపకుండా చిత్ర యూనిట్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో ఓ సాంగ్ విషయంలో బ్రాహ్మణ సంఘాలు పెద్ద ఎత్తున గొడవ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలంటూబోయ హక్కుల పోరాట సమితి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం డీజీపీ, సెన్సార్‌ బోర్డు, ఫిలిం ఛాంబర్‌లతో పాటు హీరో వరుణ్‌ తేజ్‌కు, చిత్రయూనిట్‌కు నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరణతో నాలుగు వారాల్లోగా    కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. కాగా, పూజా హెగ్డే, అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని 14రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌ పై నిర్మించారు. మిక్కీ జే మేయర్‌ బాణీలు అందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: