ప్రభాస్, శ్రధ్ధాకపూర్ జంటగా నటించిన సాహో సినిమాను యువి క్రియేషన్స్ నిర్మాతలు దాదాపు 350 కోట్ల రుపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. సాహో సినిమా విడుదలైన రోజే సినిమాకు ప్రేక్షకుల నుండి ప్లాప్ టాక్ వచ్చింది. సినిమాపై విడుదలకు ముందే భారీగా అంచనాలు ఏర్పడటంతో వీకెండ్ వరకు కలెక్షన్లు భారీగా వచ్చాయి. మొదటి వీకెండ్ తరువాత డ్రాప్ అయిన సాహో కలెక్షన్లు ఆ తరువాత పుంజుకోలేదు. 
 
తెలుగు రాష్ట్రాల్లో సాహో సినిమా హక్కులు 125 కోట్ల రుపాయలకు అమ్మారు. కానీ రెండు వారాల్లో ఈ సినిమాకు కేవలం 80 కోట్ల రుపాయల షేర్ మాత్రమే వచ్చింది. సినిమాకు పుల్ రన్లో మరో రెండు మూడు కోట్లు వచ్చినా సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం 40 కోట్ల రుపాయలకు పైగా నష్టాలు మాత్రం తప్పటం లేదు. ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో నష్టాలు సాహో సినిమాకు మాత్రమే వఛ్చాయి. 
 
బాలీవుడ్ లో మాత్రం సాహో సినిమా బ్రేక్ ఇవెన్ అవ్వటం నిర్మాతలకు అంతో ఇంతో సంతృప్తినిచ్చే విషయం. తమిళనాడు, కేరళ, ఓవర్సీస్లో మాత్రం సాహో సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీ స్థాయిలో నష్టాలు తప్పటం లేదు. ఈరోజు విడుదలైన గ్యాంగ్ లీడర్ సినిమాకు హిట్ రావటంతో సాహో సినిమాకు ఇక కలెక్షన్లు రావటం కష్టమేనని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. 
 
యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. 1960 సంవత్సరానికి సంబంధించిన కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు రాబోతుంది. దాదాపు 180 కోట్ల రుపాయల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ జ్యోతిష్యం చెప్పే పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: