సూపర్ స్టార్ మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన కియారా అద్వాని ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వెంటనే మెగా పవర్ స్టార్ రాం చరణ్-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో మళ్ళీ తెలుగులో అవకాశాలు రాలేదు. కానీ అర్జున్ రెడ్డి రీమేక్ అయిన కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో ఒక్కసారిగా టాప్ హీరోయిన్ అయిపోయింది. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. తెలుగు అర్జున్ రెడ్డి గా నటించిన విజయ్ దేవరకొండ కు ఏమాత్రం తగ్గకుండా షాహిద్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాతో షాహిద్ మార్కెట్ అమాతం పెరగడమే కాదు బాలీవుడ్ లో కలెక్షన్ల పరంగా రికార్డ్ ను క్రియోట్ చేసింది. ఇక లస్ట్ స్టోరీస్ తో ఆకట్టుకున్న ఈ సినిమాతో బాలీవుడ్ లో తిరుగు లేని హీరోయిన్ గా స్టార్ డమ్ ని సంపాదించుకుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫొటో షూట్స్ తో నేషనల్ మీడియాని కూడా ఆకట్టుకుంది.

ఇక ఈమధ్య బాలీవుడ్ లో అగ్రపథం వైపు దూసుకుపోతున్న భామ కియారా అద్వాని. సీనియర్ హీరోయిన్ల హవా తగ్గడం.. కొందరేమో పెళ్ళి చేసుకొని శ్రీమతులుగా మారడంతో కియారా కు డిమాండ్ పెరిగింది.  ఆ డిమాండ్ కు తగ్గట్టే కియారా కూడా తన టాలెంట్ తో.. బోల్డ్ నెస్ తో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అంతేకాదు కియరా ఫ్యాషన్ పీక్స్ లో ఉంటుందన్న నిజం అందరికీ తెలిసిందే.  సందర్భానికి తగ్గట్టు దుస్తులు ధరించడం.. ఆ దుస్తులకు తన స్టైల్ ను యాటిట్యూడ్ ను జోడించి నెటిజన్ల ను క్షణాల్లో ఆకట్టుకోవడం కియారాకు చిటికెలో పని అన్నట్టుగా స్పీడ్ పెంచేసింది. ఇక ఈ మధ్య కాలంలో కియారాను చూసిన వాళ్ళు ఇండియాలో ఉండాల్సిన అమ్మాయి కాదు.. ఎక్కడో హాలీవుడ్ లో ఉండాల్సింది అని కితాబులిస్తున్నారు.

ఇక కియారా సినిమాల విషయానికి వస్తే తెలుగులో ఒక్క సినిమా కమిటవనప్పటికి చేతిలో నాలుగు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అవన్నీ కూడా బాలీవుడ్ సినిమాలు కావడం విశేషం. 'గుడ్ న్యూస్'.. 'లక్ష్మి బాంబ్'.. 'షేర్ షా'.. 'ఇందూ కీ జవాని' సినిమాల్లో కియారా నటిస్తోంది. ఇక తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలో హీరోయిన్ అవకాశం వస్తే డేట్స్ అడ్జస్ట్ చేయలేనని 'నో' చెప్పిందట. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ముందు హీరోయిన్ గా రష్మిక మందన్నను తీసుకున్నారు. కానీ డేట్స్ సర్దుబాటు చేయలేక రష్మిక సినిమా నుండి తప్పుకుందట. దీంతో కియారాను సంప్రదిస్తే తను కూడా ఇదే కారణం తో సైడ్ అయింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: