సూపర్ స్టార్ మహేష్ బాబు అంత సులభంగా ఏ ప్రాడెక్ట్ ని ప్రమోట్ చేయడు. జన్యూన్ ప్రాడెక్ట్ అయితే తప్ప మాట్లాడరు. ఇక మహేష్ ఏదైనా ఒక ప్రాడెక్ట్ లేదా ప్రాజెక్ట్ గురించి మాట్లాడినా లేదంటే ఏదైనా సినిమా గురించి ఆయన చిన్న ట్వీట్ చేసినా కూడా అది కాస్త చాలా వైరల్ అవ్వడం తెలిసిందే. అందుకే మహేష్ బాబుతో తమ బ్రాండ్స్ కు పబ్లిసిటీ చేయించుకునేందుకు క్యూ కడుతూ ఉంటారు. ఇక పబ్లిక్ అవైర్ నెస్ కార్యక్రమాల్లో కూడా తనవంతు పాత్ర పోషిస్తూ ఉంటాడు. అందులో భాగంగానే తాజాగా ప్రముఖ చక్రసిద్ద్ నాడి వైధ్యంకు ప్రమోటర్ గా మహేష్ బాబు ముందుకు వచ్చాడు.

తన యూట్యూబ్ ఛానెల్ లో ఒక వీడియోను మహేష్ బాబు పోస్ట్ చేశాడు. ఎన్నో రకాలా దీర్ఘకాలిక రోగాలకు బాగా పని చేస్తున్న చక్రసిద్ద్ నాడి వైధ్యం గురించి, ఆ వైధ్యం అందిస్తున్న డాక్టర్ సత్య సింధూజ గురించి మాట్లాడిన వీడియోను మహేష్ బాబు పోస్ట్ చేశారు. దాదాపు అరగంట ఉన్న ఈ వీడియోలో సుమ యాంకర్ గా వ్యవహరించి మహేష్ బాబును ఈ వైద్యం గురించి ప్రశ్నించారు. అంతేకాదు సూపర్ స్టార్ తో పాటు డాక్టర్ సత్య సింధూజ గారిని సుమ చాలా విషయాలు అడిగారు. 

ఈ వైద్యంకు సంబంధించిన పలు విషయాలను కూడా డాక్టర్ సత్య సింధూజ వెళ్లడించారు. చాలా కాలం పాటు తాను బాధ పడ్డ మైగ్రేన్ తలనొప్పిని ఈ వైద్యం ద్వారానే తగ్గించుకున్నట్లుగా మహేష్ బాబు చెప్పగా.. ప్రస్తుతం తను ఇంత హెల్దీగా ఉన్నందుకు కారణం ఈ ట్రీట్ మెంట్ అంటూ సుమ చెప్పుకొచ్చింది. మొత్తానికి మొన్నటి వరకు పెద్దగా సాధారణ జనాలకు తెలియని చక్రసిద్ద్ నాడి వైధ్యం గురించి మహేష్ బాబు మాట్లాడటంతో ఇప్పుడు అంతా ఆ వైద్యం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, చర్చించుకుంటున్నారు. ఇక అతి కొద్ది రోజుల్లోనే ఈ చక్రసిద్ద్ నాడి వైద్యం గురించి అందరికి అవగాహన రాబోతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: