వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ కు సంతకాలు చేస్తూ క్వీన్ కంగన బాలీవుడ్ లో మిగతా హీరోయిన్స్ కి చెక్ పెడుతున్న సంగతి తెలిసిందే. మణికర్ణిక తర్వాత కంగన యాక్టివిటీస్ చూస్తుంటే పురుషాహంకార ప్రపంచంపై యుద్ధం ప్రకటించినట్టే కనిపిస్తోంది. వరుసగా బయోపిక్ లు.. లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమాలకు సంతకాలు చేసి దూకుడుగా కనిపిస్తోంది. అంతేకాదు స్టార్ హీరోస్ కి ఎదురెళుతోంది. ప్రస్తుతం కంగన.. అమ్మ జయలలిత బయోపిక్ కోసం ప్రిపరేషన్ లో ఉందని ప్రచారం సాగింది. అయితే కంగన మాత్రం ఒకేసారి రెండు ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోందని లేటెస్ట్ న్యూస్. ఇటు సౌత్ లో తలైవి బయోపిక్ కోసం..అటు బాలీవుడ్ లో 'ధాకడ్' సినిమా కోసం ఒకే సారి రెడి అవుతోందట.

తాజా సమాచారం ప్రకారం.. కంగన.. జయలలిత బయోపిక్ అక్టోబర్ చివరి వారంలో సెట్స్ పైకి వెళుతోందని తెలుస్తోంది. ఇందులో నాలుగైదు దశల్లో విభిన్న రూపాలతో కంగన దర్శనమివ్వనుందట. కంగన మేకప్ కోసం కెప్టెన్ మార్వెల్- బ్లేడ్ రన్నర్ లాంటి భారీ సినిమాలకు పని చేసిన హాలీవుడ్ మేకప్ మ్యాన్ జేసన్ కొలిన్స్ కంగన ను అమ్మలా మార్చబోతున్నాడట. కంగన కూడా చాలా కష్టపడుతుందని సమాచారం.

మరోవైపు బాలీవుడ్ యాక్షన్ మూవీ 'ధాకడ్' జనవరిలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యాక్షన్ క్వీన్ గా కంగన కనిపించనుంది. మెషీన్ గన్ చేతపట్టి బుల్లెట్ల వర్షం కురిపించే వారియర్ తరహా పాత్రలో కంగన కనిపించనుందని ఫస్ట్ లుక్ క్లారిటీ ఇచ్చింది. దీనికోసం కంగనకు 45 రోజుల ట్రైనింగ్ సెషన్స్ ని దర్శకుడు రజనీష్ ప్లాన్ చేశాడు. మణికర్ణిక కోసం ఇప్పటికే కత్తి యుద్ధానికి సంబంధించిన శిక్షణ పొందిన కంగన దానికి పూర్తి కాంట్రాస్ట్ గా 'ధాకడ్' కోసం ఆరువారాల పాటు బ్యాటిల్ ఫీల్డ్ కి సంబంధించిన శిక్షణ తీసుకోనుందట. ఒకేసారి ఈ తరహాలో రెండు భారీ చిత్రాలకు డేట్స్ సర్ధుబాటు చేసింది. ముందు తలైవి సినిమాపై ఆ తర్వాత జనవరి నుంచి 'ధాకడ్' పై ఫోకస్ చేయనుంది కంగన. ఈ దూకుడు చూస్తుంటే బాలీవుడ్ లో స్టార్ హీరోస్ కి గట్టి పోటీగా నిలబడబోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: