కీర్తి సురేష్ అంటే గుర్తుకువచ్చేది మహానటి ట్యాగ్. ఆమె నటించిన చిత్రాలు ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ మహానటి మాత్రం మరపురాని చిత్రమైంది. ఆమెకు జాతీయ స్థాయి అవార్డు ని కూడా తెచ్చిపెట్టిన ఈ చిత్రం కీర్తిని ఎక్కడికో తీసుకుపోయింది. ఒక్క సినిమా చాలు కీర్తిని అలనాటి నటీమణుల సరసన నిల్పింది. నిజానికి కీర్తికి అందంతో పాటు అభినయం కూడా మెండుగా ఉంది. దాన్ని చక్కగా వాడుకున్న సినిమా మహానటి.


సరైన టైంలో పడిన మూవీగా మహానటి కీర్తి చలనచిత్ర కీర్తికిరీటంలో మిగిలిపోతుంది. ఇదిలా ఉండగా కీర్తి ఏ సినిమా చేయాలన్న సందిగ్దంలో  పడిందంటేనే చాలు ఆమె ఈ కీర్తి శిఖరాల మీద ఉందో. ఇక ఈ మూవీ తరువాత కీర్తిని కమర్షియల్ మూవీలో నటించమని హీరోలెవరూ అడగలేకపోతున్నారుట.


ఇవన్నీ ఇలా ఉంచితే కీర్తికి ట్రెడిషనల్ లుక్ అదిరిపోతుందని మహానటి ప్రూవ్ చేసింది. అది మూవీ. ఇక నిజజీవితంలో కీర్తి కట్టూ బొట్టూ జడలో పూవులు చేతికి గాజులు చక్కని చీరతో  పుత్తడి బొమ్మలా మెరిసిపోయిన ఫోటోలు ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అంతే కాదు కీర్తి లుక్ అదుర్స్ అంటూ నెటిజన్లు కామెంట్స్ కూడా పెడుతున్నారు.


ఇంతకీ విషయం ఏంటంటే కీర్తి కేరళ పెద్ద పండుగ ఓనం ని సప్రదాయబధ్ధంగా జరుపుకుంది. ఈ సందర్భంగా చక్కగా చీర కట్టి బొట్టు పెట్టి  కొప్పున పూలు పెట్టి మెరిసిపోతూంటే ఒకనాటి నటి అయిన వాళ్ళమ్మ మేనక మురిసిపోయిందట. ఆ చిత్రాలను నెటిజన్ల కోసం కీర్తి పంచుకుంటే ఎంత చక్కంగా ఉన్నావే కీర్తమ్మ అంటున్నారుట జనం. నిజమైన అందం కీర్తిలో ఉందని కూడా అంటున్నారుట. ఏ మేకప్పు అక్కరలేని బొమ్మ అని కూడా కితాబు ఇస్తున్నారుట.



మరింత సమాచారం తెలుసుకోండి: