ప్రభాస్ తన స్నేహితులను ఎంతగా ప్రేమిస్తాడు అన్న విషయం మరొకసారి బయటపడింది. ప్రభాస్ గోపిచంద్ లు సినిమాలలోకి రాకముందే ప్రాణ స్నేహితులు. ఈ ఇద్దరికీ సినిమా అవకాశాలు లేక ఖాళీగా ఉంటూ ఒకే మోటార్ బైక్ పై హైదరాబాద్ లోని వీధులు అన్నీ తిరిగిన సంగతులను ఒకసారి స్వయంగా ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. 

వాస్తవానికి ప్రభాస్ కంటే గోపిచంద్ కు ముందుగా సినిమాలలో హిట్స్ వచ్చాయి. దీనితో తనకన్నా గోపిచంద్ ముందుగా టాప్ హీరో అయిపోతాడు అని ప్రభాస్ భావించే వాడట. అయితే అంచనాలు తలక్రిందులై ప్రభాస్ నేషనల్ సేలేబ్రేటీ స్థాయికి ఎదిగిపోతే గోపీచంద్ ఇంకా తన కెరియర్ లో సెటిల్ అవ్వలేక పోతున్నాడు. 

ఇలాంటి పరిస్థితులలో స్నేహితుల మధ్య గ్యాప్ రావడం సర్వసాధారణం. అయితే అలాంటి గ్యాప్ రాకుండా ప్రభాస్ గోపిచంద్ తో త సాన్నిహిత్యాన్ని కొనసాగించడమే కాకుండా అతడికి ఏ సమస్య వచ్చినా ఇప్పటికీ వెన్నంటి ఉంటున్నాడు అన్న విషయం అతి తక్కువ మందికి తెలుసు. 

మంచి కథ దొరికితే గోపిచంద్ కోసం ఒక మల్టీ స్టారర్ లో నటించాలని ఎప్పటి నుంచో ప్రభాస్ ప్రయత్నిస్తున్నాడు. ఈమధ్య జరిగిన గోపీచంద్ రెండవ కొడుకు పుట్టినరోజు వేడుకలకు ప్రభాస్ వచ్చి మరొకసారి తన స్నేహ బంధాన్ని చాటుకున్నాడు. చాల సింపుల్ గా బ్లాక్ షర్ట్ వేసుకుని ప్రభాస్ గోపిచంద్ కొడుకు పుట్టినరోజు వేడుకలలో నవ్వుతూ కనిపిస్తున్న ఫోటోలను చూస్తుంటే ప్రభాస్ ‘సాహో’ షాక్ నుండి పూర్తిగా తెరుకున్నట్లే అని అనిపిస్తోంది. ‘లక్ష్యం’ తరువాత గోపీచంద్ సరైన హిట్స్ లేక చాల మధన పడుతున్నాడు. ఇలాంటి పరిస్థితులలో అతడు లేటెస్ట్ గా నటిస్తున్న ‘చాణక్య’ మూవీ పై చాల ఆశలు పెట్టుకున్నాడు. ప్రభాస్ ఇస్తున్న ప్రోత్సాహంతో గోపిచంద్ ఆసలు నేరవేరుతాయేమో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: