ప్రధాన మంత్రి.. ఈ దేశానికి రాజు లాంటి వాడు.. అందులో భారత్ వంటి పెద్ద దేశానికి ప్రధాన మంత్రి అంటే మాటలు కాదు.. పేరుకు ప్రధాన మంత్రి పేరు మీద పాలన సాగుతుంది కానీ.. చాలా నిర్ణయాల వెనుక.. ఆయన కార్యాలయం పాత్ర చాలా ఉంటుంది. మరి ఆ ప్రధాన మంత్రి కార్యాలయంలో ఏం జరుగుతుంది.. నిర్ణయాలు ఎలా తీసుకుంటారు.. ఒక్కో నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయం ఉంటుంది..


ఇలాంటి ఇంట్రస్టింగ్ టాపిక్స్ తో రూపొందిందే బందోబస్త్.. ఇంత వరకూ ఎవరూ పెద్దగా టచ్ చేయని ఈ సబ్జక్ట్ ను సూర్య బందోబస్త్ లో వివరించారు. ఈ ‘బందోబస్త్’ డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘రంగం’ ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకుడు. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇక్కడ కె. వి. ఆనంద్ సినిమా అంటేనే.. చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ఏ విషయాన్నైనా పరిశోధించి.. ఆయన కథ రెడీ చేసుకుంటారు. కె వి ఆనంద్ గారు బేసిక్ గా ఒక జర్నలిస్ట్. ఆయన తీసే సినిమాలు మన చుట్టూ జరిగే వాస్తవ సంఘటనలు ప్రతిబింబించేవిగా ఉంటాయి. ఒక కేసు గురించి కానివ్వండి, పొలిటికల్ ఇష్యూ గురించి కానివ్వండి ఆయన చాలా ఇన్ఫర్మేషన్ సేకరించి, రీసెర్చ్ చేసి సినిమా తీస్తారు.


అందుకే ఆయన సినిమాల్లో కాన్సెప్ట్ లు చాలా లోతుగా ఉంటాయి. అందుకే ఆయన దర్శకత్వంలో నటించడానికి ఎవరైనా ఆసక్తి చూపిస్తారు. ఇక ఈ బందోబస్త్ కథ భారత దేశం మొత్తానికి సంబందించిన కథ. వ్యవసాయం, రాజకీయాలు, దేశభద్రత వంటి ప్రధానాంశాల సమాహారంగా తెరకెక్కిన చిత్రం ఇది. ఒక వ్యక్తి సోషల్ వాల్యూస్ వదిలేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి. అసలు ఇంతకీ ఆ వ్యక్తి అలా మారడానికి కారణాలేమిటి ? ప్రధాన మంత్రి ఆఫీస్ లో వాస్తవంగా ఎటువంటి సంఘటలు జరుగుతాయి అనే అంశాలు ఆకట్టుకుంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: