బిగ్ బాస్ చప్పగా సాగడానికి కారణం కంటెస్టెంట్స్ ఒక కారణమయితే, బిగ్ బాస్ నిర్వాహకులు నిర్వహించే టాస్క్ లు కూడా మరో కారణం. ఆ టాస్క్ లలో లాజిక్ లేకపోవడం ,ఆసక్తిగా ఉండకపోవడంతో సూపర్ హిట్ అవ్వాల్సిన టాస్క్ లు ప్రేక్షకులని రంజింపజేయలేకపోతున్నాయి. దీనికి ఉదాహరణగా శుక్రవారం జరిగిన టాస్క్ ని చెప్పుకోవచ్చు.


ఆ టాస్క్ లో బిగ్ బాస్ కన్ఫెషన్ రూంలో జరిగిన విషయాన్ని ఇంటి సభ్యులతో పంచుకోమన్నపుడు, కంటెస్టెంట్ నిజం చెప్తున్నాడా? అబద్ధం చెప్తున్నాడా అనేది మిగతా సభ్యులు గెస్ చేయాలి. కరెక్ట్ గా గెస్ చేస్తే, డిన్నర్ పార్టీ ఇస్తానని చెప్పాడు. దాంతో హౌస్ మేట్స్ అందరూ ముందే మాట్లాడుకుని అక్కడేం జరిగిందో ఉన్నది ఉన్నట్టు  చెప్పాలని డిసైడ్ అయ్యారు.


అలా కాకుండా అక్కడ జరిగింది కాకుండా అబద్ధం చెప్పి మిగతా హౌస్ మేట్స్ నమ్మించిన వారికి స్పెషల్ ట్రీట్ ఉంటుందని కంటెస్టెంట్ మరింత ఇంట్రెస్ట్ తో ఆడేవారు. ఏ అబద్ధం చెప్పాలనే విషయం కూడా బిగ్ బాస్ చెప్పకుండా వాళ్ళ క్రియేటివిటీకే వదిలేస్తే టాస్క్ లో మజా వచ్చేది. బిగ్ బాస్ ఏం చేయాలో చెప్పడం వల్ల, వాళ్ళు దాన్ని సరిగ్గా పర్ ఫార్మ్ చేయక అబద్ధం ఆడుతున్నట్టు దొరికిపోయారు. ఒక్క రాహుల్ విషయంలోనే కొంత ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.


మిగతా హౌస్ మేట్స్ కి కూడా అలా డిజైన్ చేసి ఉంటే టాస్క్ మరింత రక్తి కట్టేది. మొదట్లో కంటెస్టెంట్స్ టాస్క్ లని సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడు సీరియస్ గా ఆడుతున్నప్పటికీ, సరైన టాస్క్ లు ఇవ్వడంలో బిగ్ బాస్ విఫలం అవుతున్నాడు. ఏది ఏమైనా బిగ్ బాస్ నిర్వాహకులు నిర్వహించే టాస్క్ లు చప్పగా సాగుతున్నాయనేది వాస్తవం. టాస్క్ లని అర్థవంతంగా, లాజిక్ తో నిర్వహిస్తే చూసేవాళ్ళకి  ముందు ముందు టాస్క్ ల విషయంలో ఇంకాస్త శ్రద్ధ వహిస్తే ఇంకా పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: