పోలీస్ అధికారి పాత్రలో సూర్య నటన అదుర్స్.. ఈ విషయం ఇప్పటికే సింగం సీరీస్ తో బాగా ప్రూఫ్ అయ్యింది. ఇప్పుడు అదే తరహా నటనతో దేశభద్రత కోసం ఎంతకైనా తెగించే డైనమిక్ కమాండో అధికారి పాత్ర పోషిస్తున్నాడు. సస్పెన్స్ , పొలిటికల్, ధ్రిల్లర్ గా వస్తున్న బందోబస్త్ సినిమాలో సూర్య పాత్ర అదే. పోలీస్ ఎస్సైగానే అదరగొట్టిన సూర్య ఇక డైనమిక్ కమాండో పాత్ర అంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.


ఒక డైనమిక్ కమెండో అధికారిగా ఒక ఆదేశం వచ్చినప్పుడు దేనికీ వెరవకుండా.. ప్రాణాలను లెక్క చేయకుండా బుల్లెట్ ఎదురుగా వస్తున్నా ముందుకెళ్లే ఢిపెన్సు ఆఫీసర్ గా ఈ సినిమాలో కనిపిస్తానంటున్నాడు సూర్య . తమిళ నటుడే అయినా సూర్య తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు కావడంతో ఈ బందోబస్త్ సినిమాకు ఇక్కడ కూడా బాగా క్రేజ్ ఉంది.


పరభాషా నటుడే అయినా సింగం వంటి సినిమాల ద్వారా సూర్య తెలుగు రాష్ట్రాల మాస్ ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఈ పాత్ర కోసం సూర్య చాలా సాహసాలే చేశాడట.. ఓ పాత్రను పోషించడమంటే ఇచ్చిన స్క్రిప్టులో డైలాగులు వల్లే వేయడమే కాదు. ఆ పాత్ర ఆత్మను పట్టుకోవడం.. అందుకే సూర్య ఈ సినిమా కోసం ఏకంగా ఆర్మీ అధికారులతో కొన్నిరోజులు గడిపాడట. ఈ పాత్ర చేయడం కోసం చాలా కసరత్తు చేయాల్సి వచ్చిందంటున్నాడు సూర్య.


అధికారికంగా, అనధికారికంగా అనేక విషయాలపై సూర్య అధ్యయ‌నం చేశాడట. అలాగే కొన్ని ప్రత్యేక అనుమతులు తీసుకొని ఢిల్లీలోని ఓ ఆర్మీ క్యాంపులో మూడు రోజులు గడపాడట సూర్య. ఆ సమయంలో కొందరు కమాండో అధికారులను కలుసుకుని వారి అనుభవాలు తెలుసుకున్నాడట. ఢిల్లీ ఆర్మీ క్యాంపులోని అధికారుల మధ్య సోదర భావం, దేశభక్తి అమోఘం అంటున్నాడు సూర్య.


మరింత సమాచారం తెలుసుకోండి: