టాలీవుడ్ లో రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి, బాహుబలి 2 సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందాయి.  అప్పటి వరకు దేశ వ్యాప్తంగా బాలీవుడ్, కోలీవుడ్ మూవీలు భారీ వసూళ్లు చేస్తూ రికార్డులు నెలకొల్పగా ‘బాహుబలి 2 ’ ఆ రికార్డులన్నీ బద్దలు చేసింది. ఈ మూవీతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి జాతీయ  స్థాయిలో మంచి పేరు వచ్చింది. అప్పటి నుంచి ప్రభాస్ నటించే సినిమాలపై కూడా భారీ అంచనాలు పెరిగిపోయాయి.  యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో భారీ యాక్షన్ మూవీ ‘సాహెూ’ కి కమిట్ అయ్యాడు ప్రభాస్. 

వాస్తవానికి ప్రభాస్ తదుపరి సినిమాలు మరో పెద్ద డైరెక్టర్ తో ఉంటుందని భావించినా సుజిత్ కి అవకాశం ఇవ్వడం అప్పట్లో అందరికీ ఆశ్చర్యం వేసింది.  ఈ మూవీ రూ.350 కోట్ల బడ్జెట్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘సాహెూ’ సినిమా రెండు సంవత్సరాలు భారీ టెక్నిషియన్స్ తో వివిధ దేశాల్లో షూటింగ్ జరుపుకున్నారు.  ఈ మూవీ టీజర్, ట్రైలర్ కి సోషల్ మీడియాలో భారీ అంచనాలే నెలకొన్నాయి. మొత్తానికి థియేటర్లలో ‘సాహెూ’ రిలీజ్ అయ్యింది..కానీ మొదటి రోజే అంచనాలు తప్పింది. 

సినిమా లో కథనం లేదని..కేవలం డబ్బు దుబారా చేశారని టాక్ వచ్చింది.  కాకపోతే ఈ సినిమా కలెక్షన్లు మాత్రం అంచనాలు దాటాయి. దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో చిత్రం కలెక్షన్లపరంగానూ అదే దూకుడు ప్రదర్శిస్తోంది. తొలి రోజే రూ.130 కోట్ల గ్రాస్ తో బాక్సాఫీసు వద్ద ప్రకంపనలు సృష్టించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ రెండు వారాలు కంప్లీట్ అయినా భారీ స్థాయిలో వసూళ్లు రాబడుతోంది.

వరల్డ్ వైడ్ రెండు వారాల్లో రూ.424 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని యూవీ క్రియేషన్స్ వెల్లడించింది. హద్దుల్లేని విధ్వంసం నుంచి తిరుగులేని ప్రభంజనం వరకు అంటూ ఈ ట్వీట్ కు క్యాప్షన్ పెట్టారు. సాహో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: