ఈ మద్య కాలంలో స్టార్ హీరోల సినిమాలు భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే మొదటి నుంచి ఈ మూవీస్ పై భారీ అంచనాలు పెట్టుకొని వస్తున్నా..థియేటర్లో మాత్రం రిజల్ట్ దారుణంగా ఉంటుంది.  స్టార్ దర్శకులు, స్టార్ హీరో పేరున్న నిర్మాణ సంస్థ..తీరా థియేటర్లకు వచ్చిన తర్వా ఆడియన్స్ ని మాత్రం ఆకట్టుకోలేక పోతున్నాయి. దాంతో పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూటర్లు మునిగిపోతున్నారు. 

ఆ మద్య కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీ నటించిన లింగ మూవీపై కోట్లు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు ఓ కమిటీ వేసుకొని రజినీని నిలదీయడంతో వారికి సహకరించి వారి కష్టాలు కొంత వరకు తీర్చినట్లు వార్తలు వచ్చాయి. ఇలా పెద్ద సినిమాల వల్ల నష్టపోయిన వారికి కొంత మంది హీరోలు తమవంతు చేయూత అందిస్తున్నారు.  అయితే పెద్ద సినిమాలతో పోటీ పడుతూ ఈ మద్య చిన్న సినిమాలు భారీగా కలెక్షన్లు వసూళ్లు చేసిన విషయం తెలిసిందే. ఆ మద్య రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి,ఆర్ఎక్స్ 100, ఈ సంవత్సరం ఎఫ్ 2, సంపూ నటించిన కొబ్బరిమట్ట సైతం మంచి వసూళ్లు చేసి లాభాల బాట పట్టాయి. 

ఈ ఏడాది రిలీజ్ అయిన రాంచరణ్ మూవి వినయవిదేయ రామ దారుణమైన డిజాస్టర్ అయ్యింది.  దాంతో కొంత మంది నిర్మాతలు పెద్ద సినిమాలవైపు కాకుండా చిన్న సినిమాలు తీస్తే బెటర్ అనుకుంటున్న పరిస్థితి నెలకొంది. కొత్త హీరో, హీరోయిన్లు, దర్శకులను ఇంట్రడ్యూస్ చేయడం వల్ల పెద్దగా ఖర్చుకూడా ఉండదు..సినిమా కంటెంట్ బాగుండి హిట్ అయితే కాసుల పంటే..అందుకని పెద్ద సినిమాల కన్నా చిన్న సినిమాలే ముద్దు అంటున్నారు.  ఈ మద్య రూ.350 కోట్లు పెట్టి ప్రభాస్ తో తీసిన ‘సాహెూ’ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: