తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 50 రోజులు దాటిపోయింది.  ఇంటి సభ్యుల మద్య ఇప్పుడు రసవత్తరమైన పోటీ నెలకొంది. ఇకనుంచి మీరు ఫినాలే కోసం కష్టపడాలని..చిల్లర పనులు, నవ్వులు, అల్లరి పక్కనబెట్టి గేమ్, టాస్క్ పై గట్టి ఫోకస్ పెట్టానిన ఇంటి సభ్యులకు బిగ్ బాస్ సూచించారు.  దాంతో ఇంటి సభ్యులు అలర్ట్ కావడం..ఎవరి గేమ్ వారు ఆడుకోవడం మొదలు పెట్టారు.  మొన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో వరుణ్ సందేష్ తన భార్య వితికను వీపు పై మోసుకు వెళ్లే టాస్క్ తో గెలిపించాడు.

ఇక శుక్రవారం జరిగిన టాస్క్ లో కామెడీతో పాటు సీరియస్ కూడా వీక్షకులను ఆకర్షించింది. బిగ్ బాస్ ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కి డిన్నర్ పార్టీ ఇస్తానని వారితో గేమ్ ఆడించాడు బిగ్ బాస్. ఇంటి సభ్యుల్ని ఒక్కొక్కరుగా సీక్రెట్ రూంలోకి పిలిచి అక్కడ వాళ్లతో వివిధ రకాల యాక్టివిటీజ్ చేయించి.  ఈ నేపథ్యంలో రాహుల్ సీక్రెట్ రూంలోకి వెళ్లిన తరువాత ఆయనతో సిటప్స్ తీయించారు బిగ్ బాస్. అంతే కాదు ఆయనకు ఓ సీక్రెట్ టాస్క్ కూడా ఇచ్చాడు.  రాహూల్ తనకు పెళ్లి సంబంధం కుదిర్చారని..ఈ విషయం స్వయంగా మా అమ్మే చెప్పిందని ఇంటి సభ్యులను నమ్మించాలి.

ఈ విషయం ఇంటి సభ్యులు నమ్మకపోతే రాహుల్ ఔట్.  ఇదే విషయాన్ని రాహూల్ ఇంట్లోకి వచ్చి అందరితో చెప్పాడు.  వరుణ్, వితికా, హిమజ ఇలా కొంత మంది రాహుల్‌ చెప్పేది అబద్ధమనిపిస్తుందని గట్టిగా వాదించారు. అయితే మిగిలిన అందరి విషయాల్లో కరెక్ట్ గా గెస్ చేసిన శ్రీముఖి.. రాహుల్ విషయంలో కరెక్ట్ గా గెస్ చేయలేకపోయింది. రాహుల్ గుండెలపై తల పెట్టి అతని హార్ట్ బీట్ విని.. రాహుల్ నిజమే చెప్తున్నాడని డిసైడ్ చేసింది.

తాను నమ్మడమే కాదు అందరూ ఇది నిజమే అని చెప్పేలా చేసింది.  అయితే అది తప్పని బిగ్ బాస్ చెప్పడంతో అందరూ తెల్లమొహాలు వేశారు. దాంతో వరుణ్ సందేష్ కి చిర్రెత్తుకొచ్చి  శ్రీముఖిపై విరుచుకుపడ్డాడు. నువ్ అనుకుంనే అనుకోవాలని కానీ మిగిలిన వాళ్లని ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావని మండిపడ్డాడు.   నీ అభిప్రాయాన్ని అందరిపై ఎందుకు రుద్దుతున్నావు అంటూ సీరియస్ అయ్యాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: