సీనియర్ నటుడు మరియు రాజకీయ నాయకుడు అయిన నందమూరి బాలకృష్ణ దుందుడుకు స్వభావం గురించి మనందరికీ తెలిసిందే. అతను చాలా సందర్భాలలో తన చుట్టూ ఉన్న జనాల పై చేయి చేసుకోవడం, ఏకంగా తన అభిమానులను ఇష్టం వచ్చినట్టు కొట్టడం చాలా వీడియోలలో చూశాం. బహిరంగంగా అసభ్య పదజాలం వాడడం, మహిళలను కించపరిచేలా మాట్లాడటం వంటివి ఎన్నో మరెన్నో. అప్పుడప్పుడు ఏదో కొందరికి సహాయం పడతాడు అని పేరున్నా... బాలకృష్ణ అనగానే మన అందరికీ గుర్తొచ్చేది మాత్రం పైన ప్రస్తావించినవే. 

ఇప్పుడు తాజాగా బాగా పేరున్న ఒక సీనియర్ నటుడు బాలకృష్ణ చేసిన పనులను సమర్దిస్తున్నాడు. ఎన్నో సినిమాల్లో చాలా మంచి పాత్రలు చేసిన గిరిబాబు బాలకృష్ణ అభిమానులని బహిరంగంగా చెంపదెబ్బలు వేసిన సందర్భాల పైన స్పందించాడు. గిరి బాబు చెబుతున్న దాని ప్రకారం అభిమానులు వచ్చి విసిగిస్తే నేను అయినా కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోతాను. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా చేయి చేసుకుంటారు. అలాగని బాలకృష్ణ కనిపించిన ప్రతి ఒక్కరిని కొడతాడని అనడం సరికాదని అని గిరిబాబు అన్నాడు.

ఇక పోతే గిరిబాబు.... బాలకృష్ణ తండ్రి, సీనియర్ ఎన్టీఆర్ తో తనకున్న అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ తన సీన్ ముగించుకున్న తరువాత ప్రతీషారి "ఏం గిరి బాగున్నావా?" అని తనని పలకరిస్తారని.... ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్ ఇండస్ట్రీకి రెండు కళ్ళ లాంటి వాళ్లని.... ఒక వందేళ్లు గడిచినా వారికి సరితూగే వారు ఈ ఇండస్త్రీకి రారు అని ఆయన అన్నాడు. ఇకపోతే చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం సంపాదించాలంటే జగన్ అలాగే వారికి జూనియర్ ఎన్టీఆర్ లాంటి యువనేత అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు. అతను వస్తేనే పార్టీ నిలబడుతుందని.... ఒకవేళ పార్టీలోకి అతన్ని తీసుకోకపోతే చాలా పెద్ద రభస జరుగుతుందని.... పార్టీ లో చీలికలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: