ఒక సినిమాని ఒకేసారి రెండు మూడు భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుంటారు. హీరో మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని ఏ భాషల్లో విడుదల చేయాలనే విషయాన్ని దర్శక నిర్మాతలు బేరీజు వేసుకుని డిసైడ్ చేస్తారు. స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి మూడు నాలుగు భాషల్లో విడుదల అవడం చూస్తుంటాం. కానీ కొన్ని సినిమాలు ఒక భాషలో హిట్ అయిన తర్వాత మరో భాషలో అనువదించి రిలీజ్ చేస్తుంటారు.


ఎలాగో ఒరిజినల్ లాంగ్వేజిలో రిలీజ్ అయి విజయం సాధించిందన్న నమ్మకంతో వేరే భాషలో రిలీజ్ చేయడానికి రిస్క్ చేస్తారు. అలా ఒరిజినల్ దానికంటే అనువదించిన చిత్రం రెండు మూడు నెలలు ఆలస్యంగా వస్తుంది. మొన్న తమిళంలో వచ్చిన అయోగ్య విషయంలో అలాగే జరిగింది. తమిళంలో విజయం సాధించాక తెలుగులో విడుదల చేశారు. కాకపోతే ఆ సినిమా తెలుగులో పెద్దగా ఆడలేదు. అది వేరే సంగతి.


అయితే ఇలా రెండు మూడు నెలలు ఆలస్యం అవడం సాధారణంగానే కనబడవచ్చు. కానీ ఏకంగా తొమ్మిది సంవత్సరాలు లేట్ అవడం అంటే ఆశ్చర్యమనే చెప్పాలి. తొమ్మిది సంవత్సరాల క్రితం 
2011 లో వచ్చిన రాజన్న సినిమా మరికొద్ది రోజుల్లో తమిళంలో విడుదల కాబోతుంది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. నాగార్జున నటించిన ఈ సినిమాను బాహుబలికి కథ అందించిన విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు.


తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో నాగార్జున పాత్రకు మంచి పేరొచ్చింది. ముఖ్యంగా కీరవాణి అందించిన స్వరాలు ప్రత్యేకం. బాహుబలి త్రయం రాజమౌళి, కీరవాణి, విజయేంద్ర ప్రసాద్ అందించిన సినిమా అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల ఫోస్టర్ ను నిర్మాత ఆర్బీ చౌదరి చేత విడుదల చేయించారు. తొమ్మిదేళ్ల తర్వాత డబ్ అవుతుండడం తో రాజమౌళి మార్క్ ఉండడం తో ఈ సినిమా ఫై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: