అఖిల్ సినిమా తో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు  అఖిల్ అక్కినేని.  మొదటి సినిమాకే స్టార్ డైరెక్టర్ .. భారీ బడ్జెట్..  అయితే సినిమాలో మ్యాటర్ లేకుంటే ఈ రెండు పెద్దగా పనికి రావన్న సంగతి తెలిసిందే.దాంతో మొదటి సినిమాతోనే అఖిల్ భారీ ప్లాప్ ను చవిచూశాడు. ఆతరువాత మినిమం గ్యారెంటీ డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో అఖిల్,హలో అనే చిత్రాన్నిచేయగా మొదటి సినిమాలాగా డిజాస్టర్ కాలేదు కాని అఖిల్ రీ లాంచ్ కు కావల్సిన విజయాన్నిమాత్రం ఇవ్వలేకపోయింది. దాంతో హలో యావరేజ్ చిత్రంగా మిగిలిపోయింది. ఇక ఈరెండు సినిమాల తరువాత తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో  మిస్టర్ మజ్ను లో నటించగా ఈ ఏడాది ప్రారంభం లో విడుదలైన ఈ చిత్రం కూడా హలో తరహా  ఫలితాన్ని మూటగట్టుకుంది. 




దాంతో ఈసారైనా హిట్ కొట్టాలని  బొమ్మరిల్లు  భాస్కర్ డైరెక్షన్ లో ప్రస్తుతం  తన నాల్గవ సినిమాలో నటిస్తున్నాడు అఖిల్.  ఇటీవలే ఈ చిత్రం యొక్క షూటింగ్ స్టార్ట్ అయ్యింది.  అయితే చిత్ర వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం  సినిమా బాగా వస్తుందని..  అఖిల్ ఈసినిమాతో  హిట్ కొట్టడం గ్యారెంటీ అనే  టాక్ వస్తుంది. అదే జరిగితే అక్కినేని ఫ్యాన్స్ కు అంత కన్నా కావాల్సిందేముంటుంది. 



 ఈ చిత్రానికి  హీరోయిన్ ను కూడా ఫైనల్ చేశారు. గత కొద్దీ రోజుల నుండి అఖిల్ జోడిగా పూజా హెగ్డే ను తీసుకోనున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు హీరోయిన్ గా ఆమెనే ఖరారు చేస్తూ  మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.  గీతా ఆర్ట్స్ 2 పతాకం ఫై బన్నీ వాసు , వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: