తమిళ నటుడు కార్తీ స్టార్ హీరో సూర్య తమ్ముడిగా  తమిళ, తెలుగు తెరలకు పరిచయం అయ్యాడు. కార్తీ కెరియర్ మొదటి నుండి కమర్షల్ మరియు ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తున్నాడు. మొదటి  సినిమా "పరుత్తివీరన్" లో ప్రియమణి తో కలిసి నటించాడు . ఈ సినిమాలో కార్తీ చేసిన డి గ్లామర్ రోల్ కు మంచి పేరు వచ్చింది.  


కార్తీ తెలుగు తెరకు యుగానికి ఒక్కడు సినిమాతో పరిచయమయ్యాడు. ఈ సినిమాలో కార్తీ పాత్ర మొదట్లో ఫన్నీ గా ఉంటూ చివరికి వచ్చే సరికి ఎమోషనల్ గా మారుతుంది. తరువాత వరుసగా వచ్చిన నా పేరు శివ, ఆవార సినిమాలు మంచి విజయం సాధించడంతో కార్తీ కి తెలుగులో మంచి క్రేజ్ తో పాటు మంచి మార్కెట్ ఏర్పడింది. ఊపిరి మరియు ఖాఖి సినిమా లోని నటనకు మంచి పేరు వచ్చింది . కార్తీ నటించిన చివరి రెండు సినిమాలు సరిగా ఆడలేదు. 

ప్రస్తుతం కార్తీ " ఖైథి" సినిమాలో నటిస్తున్నాడు.  ఒక మొరటు ఖైదీ పాత్రలో కార్తీ నటన సినిమాకై  హైలెట్ గా నిలుస్తుందని తమిళ సినీ వర్గాల టాక్.ఇది ఒక డి గ్లామర్ రోల్ మరియు ఈ చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా తక్కువగా ఉంటాయి. సినిమాలో పాటలు ఉండవని.. కనీసం హీరో కార్తీకి జోడీగా హీరోయిన్ కూడా ఉండదని అంటున్నారు.తెలుగు ప్రేక్షకులు ప్రయోగాత్మక చిత్రాలను  ఆదరిస్తున్నారు అందువల్ల ఈ సినిమాను తెలుగులో ఖైదీ గా రిలీజ్ చేస్తున్నారు.


ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ని చూస్తే కార్తి పాత్ర ఎంత మొరటుగా ఉంటుందో అర్థం అవుతుంది. లోకేష్ కంగరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా  అక్టోబర్ 26న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: