బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు హోస్ట్ నాగార్జున ఎప్పుడూ చలాకీగా కంటెస్టంట్స్ ను ఆటపాటలతో ఆడిస్తుంటాడు. 8 వారాలుగా నాగ్ హోస్టింగ్ టాలెంట్ కు తెలుగు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. శని, ఆదివారాలు వచ్చాయంటే ఇంటి సభ్యులతో పాటుగా నాగార్జున చేసే హంగామా కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తుంటారు. 


అయితే ఏమైందో ఏమో ఈ శనివారం నాగార్జున చాలా సీరియస్ గా షోని స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈరోజు ఎపిసోడ్ ప్రోమో కొద్ది గంటల క్రితం రిలీజ్ చేశారు. నాగార్జున ఎంట్రీ ముందు వచ్చే ఇంట్రో సాంగ్ వస్తుండగా ఆ సాంగ్ వద్దని చెప్పి డ్యాన్సర్స్ ను వెనక్కి పంపించేశాడు. ఇంతకీ నాగార్జున ఎందుకు ఇలా చేశారన్నది హాట్ న్యూస్ గా మారింది.


గడిచిన వారం రోజులు ఇంటి సభ్యులు చేసిన అతి వల్లే నాగార్జున వారి మీద సీరియస్ గా ఉన్నాడని తెలుస్తుంది. అంతేకాదు ఇంట్లోకి వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ శిల్పా చక్రవర్తిని అందరు కలిసి టార్గెట్ చేయడం కూడా నాగార్జునకు నచ్చలేదని టాక్. ఇక పునర్నవి షూ పాలిష్ చేసే టాస్క్ లో బిగ్ బాస్ ఆదేశాలను కూడా లెక్క చేయకపోవడంపై నాగార్జున కంటెస్టంట్స్ మీద చాలా సీరియస్ గా ఉన్నాడని తెలుస్తుంది.


మరి కేవలం ప్రోమోలోనే నాగార్జున ఇలా సీరియస్ గా ఉండి షోలోకి వెళ్లాక ఎప్పటిలానే జాలీగా ఉంటాడా లేక నిజంగానే ఈవారం నాగార్జున ఇంటి సభ్యులను కడిగిపారేస్తాడా అన్నది చూడాలి. ఇక ఈ వారం నామినేషన్స్ లో శ్రీముఖి, శిల్పా చక్రవర్తి, మహేష్, పునర్నవి, హిమజ ఉన్నారు. వారిలో ఈ వారం ఇంటి నుండి ఎవరు బయటకు వెళ్తారో తెలియాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: