సినిమాకు ఎన్ని కోట్లు ఖర్చుపెట్టామన్నది కాదు.. కంటెంట్ ఏ స్థాయిలో ఉందనేదే ముఖ్యం. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేది, కలెక్షన్లు రాబట్టేది ఆ కంటెంట్ మాత్రమే. కోట్లు పెట్టినా కంటెంట్ ఉంటే బాహుబలి స్థాయి కలెక్షన్లు, కంటెంట్ ఉంటే రంగస్థలం స్థాయి కలెక్షన్లు వస్తాయని ఈ సినిమాలు నిరూపించాయి. ప్రభాస్ రీసెంట్ మూవీ సాహో యుఎస్ కలెక్షన్లే దీనికి ఉదాహరణ.

 

 

 

గతేడాది రిలీజయిన మెగా పవర్ స్టార్ సెన్సేషన్ రంగస్థలం నాన్ బాహుబలి రికార్డులతో బాక్సాఫీస్ ని షేక్ చేసింది. యుఎస్ మార్కెట్ లో కూడా అదిరిపోయే నాన్ బాహుబలి రికార్డు కలెక్షన్లు సాధించింది. 3.5 మిలియన్ డాలర్ల కలెక్షన్లతో అక్కడ కూడా నాన్ బాహుబలి కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రభాస్ సాహో మాత్రం అక్కడ 3.2 మిలియన్ డాలర్ల దగ్గరే ఆగిపోయింది. కెనడా, నార్త్ అమెరికా కలెక్షన్లు కలపకపోతే సాహో సాధించింది 2.7 మిలియన్ డాలర్లు మాత్రమే. కెనడా, నార్త్ అమెరికా కలెక్షన్లు రంగస్థలంకు కలపలేదని సమాచారం. కంటెంట్ కి, కోట్ల ఖర్చుకు సంబంధం లేదని ఈ కలెక్షన్లు నిరూపిస్తున్నాయి.

 

 

 

సాహోకి వచ్చిన టాక్ కి ఇక ఓవర్సీస్ లో కలెక్షన్లు కష్టమే. ఈ వారం నానీస్ గ్యాంగ్ లీడర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఇక సాహోకి బ్రేక్ పడినట్టే. తెలుగు స్ట్రెయిట్ లో కూడా రంగస్థలంను సాహో బీట్ చేయలేకపోయింది. రంగస్థలం కేవలం తెలుగు వెర్షన్లోనే 92 కోట్లు షేర్ వసూలు చేయగా సాహో 70 కోట్ల వద్దే ఆగిపోయిందని ట్రేడ్ వర్గాల సమాచారం. బాహుబలితో 8 మిలియన్ల మార్క్ చేరుకున్న ప్రభాస్ సాహో కేవలం 2.7 మిలియన్ల వద్దే ఆగిపోవడం విచిత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి: