గత కొంతకాలం నుండి హీరో నాని కెరీర్ చెప్పుకునేంత గొప్పగా ఏమీ లేదు. నాని డ్యూయల్ రోల్ లో నటించిన కృష్ణార్జున యుధ్ధం ప్లాప్ అయింది. ఆ తరువాత నాగార్జునతో కలిసి నాని నటించిన మల్టీస్టారర్ దేవదాస్ కూడా ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టులోకపోయింది. కొన్ని నెలల క్రితం విడుదలైన జెర్సీ సినిమాకు హిట్ టాక్ వచ్చినా, క్రిటిక్స్ నుండి మంచి రివ్యూలే వచ్చినా భారీ కలెక్షన్లు మాత్రం రాబట్టలేకపోయింది. 
 
సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నానికి నిన్న విడుదలైన గ్యాంగ్ లీడర్ రూపంలో భారీ హిట్ వచ్చినట్లే అని చెప్పవచ్చు. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రుపాయలకు, రెండు తెలుగు రాష్ట్రాల్లో 21 కోట్ల రుపాయలకు అమ్ముడయ్యాయి. మొదటిరోజే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో నాలుగున్నర కోట్ల రుపాయల షేర్ వచ్చింది. హైదరాబాద్ లాంటి మేజర్ ఏరియాలో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. 
 
వీకెండ్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 60 - 70 % రికవరీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సినిమాను తక్కువ రేట్లకే అమ్మటంతో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. అమెరికాలో కూడా గ్యాంగ్ లీడర్ సినిమాకు కలెక్షన్లు బాగానే ఉన్నాయని సమాచారం. సాహో సినిమా రిలీజై ఇప్పటికే రెండు వారాలు కావటం, వాల్మీకి సినిమా రిలీజ్ అయ్యే వరకు గ్యాంగ్ లీడర్ సినిమాకు పోటీనిచ్చే సినిమా లేకపోవటం గ్యాంగ్ లీడర్ సినిమాకు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. 
 
ఒక సాధారణమైన కథకు విక్రమ్ కె కుమార్ తన కథనంతో మ్యాజిక్ చేశాడు. పాత్రలకు తగిన నటీనటుల్ని ఎంచుకోవటంతోనే విక్రమ్ కె కుమార్ సగం సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. నాచురల్ యాక్టింగ్ తో నాని తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. విలన్ గా కార్తికేయ నటన, లక్ష్మి నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: