మీటూ, కాస్టింగ్ కౌచ్, కమిట్ మెంట్ పేరు ఏదైనా అవకాశాల కోసం కొంతమంది హీరోయిన్స్ ను వేధిస్తున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ లో మొదలైన ఈ మీటూ ఎఫెక్ట్ టాలీవుడ్ వరకు పాకింది. బాలీవుడ్ లో అయితే మీటూ ఎఫెక్ట్ వల్ల కొన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయి కూడా. తెలుగు పరిశ్రమలో శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ అంటూ ఉద్యమం చేపట్టినా ఆమె ట్రాక్ తప్పేసరికి అది కాస్త వర్క్ అవుట్ కాలేదు.


సినిమా ఛాన్స్ రావాలంటే కమిట్ మెంట్ ఇవ్వాల్సిందే అన్నట్టుగా కొందరు హీరోయిన్స్ చెబుతున్నారు. ఇండస్ట్రీలో అసలు కమిట్ మెంట్ కల్చర్ ఉందా..? ఉంటే ఎలా ఉంటుంది..? అసలు కమిట్ మెంట్ ప్రపోజల్ ఎలా చేస్తారు..? ఇలాంటి వాటికి సమాధానం చెప్పేందుకు ఒక సినిమా వస్తుంది. సినిమా టైటిలే కమిట్ మెంట్ అని పెట్టారు.


లక్ష్మీ కాంత్ చెన్నా డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా పోస్టర్ అదిరిపోయింది. కమిట్ మెంట్ టైటిల్ కు తగినట్టుగానే బెడ్ రూం పోస్టర్ రిలీజ్ చేశాడు దర్శకుడు లక్ష్మీ కాంత్. సమాజంలో జరుగుతున్న ఓ నిజం అంటూ సినిమాలు ట్యాగ్ లైన్ పెట్టాడు. ఇక ఈ సినిమా కథ కూడా నిజంగా జరిగిన కథ ద్వారా తీస్తున్నట్టు చెబుతున్నారు.


ఏది ఏమైనా కమిట్ మెంట్ పోస్టర్ అందరిని సర్ ప్రైజ్ చేసింది. ఫస్ట్ లుక్ తోనే ఇంప్రెస్ చేసిన ఈ చిత్రయూనిట్ ఎంతవరకు నిజా నిజాలను ప్రస్థావిస్తుందో చూడాకి. ఇది కేవలం ఇండస్ట్రీకి చెందిన సినిమానేనా లేక సమాజంలో జరుగుతున్న విషయాలను ప్రస్థావిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. పోస్టర్ తో దర్శకుడు లక్ష్మికాంత్ ఎట్రాక్ట్ చేశాడు. మరి కంటెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో చూడాలి.   




మరింత సమాచారం తెలుసుకోండి: