యంగ్ రెబల్ స్టార్  ప్ర‌భాస్ హీరోగా  అత్యంత భారీ బ‌డ్జెట్ తో  హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన్న 'సాహో' చిత్రం నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుని మొత్తానికి  బాక్సాఫీస్ వద్ద విఫలం అయింది. అందుకేనేమో  ప్రభాస్ తన తరువాత సినిమా 'జాన్' పై చాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. స్క్రిప్ట్ ను మళ్లీ ఒక్కసారి మొత్తం సరి చూసుకోమని ఇప్పటికే దర్శకుడికి చెప్పినట్లు తెలుస్తోంది. పరుచూరి బ్రదర్స్ కూడా స్క్రిప్ట్ లో లోపాలు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తున్నారట.  పరుచూరి బ్రదర్స్ ను ప్రభాసే  ప్రత్యేకంగా స్క్రిప్ట్ ను  చూడమని చెప్పారట. జిల్ చిత్రాన్ని తెరకెక్కించిన ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌  తెరకెక్కిస్తోన్న ఈ  పీరియాడిక్‌ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఓ థ్రిల్లింగ్  ప్రేమకథ.   పైగా 1960 కాలంలో ఈ కథ సాగుతుంది,  అయితే  ప్రభాస్  వింటేజ్ కార్లను కొనుగోలు చేసే ధనికుడిగా ఈ సినిమాలో  కనిపించబోతున్నాడట.  సినిమాలో  వింటేజ్ కార్లకు ప్రభాస్ కు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయట. ముఖ్యంగా  కార్లను అమితంగా ఇష్టపడే ప్రభాస్ ఒక పేదింటి అమ్మాయి  ప్రేమలో పడతాడని..  అలాగే ప్రేమ కోసం ఏమి లేని వాడిగా ఆమె ముందే తిరుగుతాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. మొత్తానికి మనంలో ఒక ఎపిసోడ్ ని గుర్తు చేస్తున్న ఈ కథనే.. ప్రభాస్ హీరోగా  ఫుల్ ఎంటర్టైనర్ గా తెర పై ఆవిష్కరించనుందా ? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో  చూడాలి.  


మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ  గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  2020 చివ‌ర్లో ఈ చిత్రాన్ని  ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.  ఇక  అత్యంత భారీ బ‌డ్జెట్ తో  హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిన్న 'సాహో' చిత్రం నెగిటివ్ టాక్ తో  బాక్సాఫీస్ వద్ద  బలమైన ఓపెనింగ్స్  సాధించినా  చివరికి ప్లాప్ చిత్రంగా నిలిచింది.  'సాహో'  ప్లాప్ తో వార్తల్లో నిలిచిన దర్శకుడు సుజీత్.  చిన్న వయసులోనే అంత పెద్ద భారీ బడ్జెట చిత్రాన్ని హ్యాండిల్ చేయలేకపోయాడనే అపవాదును మూట కట్టుకున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: