టాలీవుడ్ లో మంచు మనోజ్ నటించిన ఝుమ్మందినాథం సినిమాతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయిన ముంబాయి సుందరి తాప్సీ పొన్ను.  మొదటి సినిమాలో తన అందచందాలతో తొడలు కనిపించేలా డ్రెస్సింగ్ వేసుకొని కుర్రాళ్ల మనసు దోచింది.  ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమా ఛాన్సులు కొట్టేసింది.  అయితే ఎన్ని సినిమాల్లో నటించిన తాప్సీ స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది ఈ సొట్ట బుగ్గల చిన్నది.  తెలుగు లో నటిస్తూనే తమిళ మూవీస్ పై కన్నువేసింది..కానీ అక్కడ కూడా సక్సెస్ కాలేక పోయింది.

ఇక బాలీవుడ్ బెటర్ అనుకొని అక్కడ కొన్ని సినిమాల్లో నటించి మంచి విజయాలు అందుకుంది.మొదట్లో స్కిన్ షోతో గ్లామర్ డాళ్ ఇమేజ్‌నే తెచ్చుకుంది. కానీ తాప్సీలో తెలియని నటి దాగుందని ఆమె బాలీవుడ్‌లో అడుగు పెట్టేదాకా ఎవరికీ అర్ధం కాలేదు.  అక్కడ ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తాప్సీ ప్రత్యేకమైన స్టార్‌డమ్ దక్కించుకుంది. తెలుగు అప్పుడప్పడు నటిస్తూ తన ఇమేజ్ ని కాపాడుకుంటూ వస్తుంది. ఈ మద్య తన బాయ్ ఫ్రెండ్ అంటూ తెగ వార్తలు వస్తున్నాయి. 

కాకపోతే అతను ఎవరో మాత్రం ఈ అమ్మడు రివీల్ చేయడం లేదు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే తాప్సీ   ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫొటోలో బ్లాక్ ట్రాన్స్‌పరెంట్ గౌనులో మెరిసింది ఈ బ్యూటీ. కాలిపై ఉన్న టాటూ ఆమెలోని రొమాంటిక్ యాంగిల్‌ని బయటపెడుతోంది.  అయితే గతంలో తన ఎదఅందాలతో ఎక్స్ పోజింగ్ చేస్తూ కుర్రాళ్ల మతులు పొగొట్టిన తాప్సీ తాజాగా మరో ఫోటోతో పిచ్చెక్కించింది. ఇక తాప్సీ నటించిన ’సాండ్ ఖీ ఆంఖ్’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: