కాజల్ అగర్వాల్ మరోసారి ఐటం బ్యూటీ అవతారం ఎత్తబోతోంది. ఆల్ రెడీ మాస్ బీట్ తో రెచ్చిపోయిన ఈ బ్యూటీ మళ్లీ రచ్చచేయబోతోంది. టాలీవుడ్ చందమామ ఓ క్రేజీ స్టార్ సినిమాలో ఆడిపాడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కు ఈ ఏడాది బ్యాక్ టూ బ్యాక్ షాక్ తగిలింది. టైటిల్ పాత్రలో నటించిన సీత సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఇక శర్వానంద్ జోడీగా నటించిన రీసెంట్ మూవీ రణరంగం కూడా డివైట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేని కాజల్ మరోసారి ఐటం సాంగ్ లో నటించేందుకు ఒకే చెప్పిందట. 


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా ఈ సినిమాలో కాజల్ స్పెషల్ సాంగ్ లో ఆడిపాడబోతోందట. ఇందుకు సంబంధించి కాజల్ తో సంప్రదింపులు కూడా పూర్తైనట్టు తెలుస్తోంది. కాజల్ ఇంతకుముందు జనతా గ్యారేజ్ సినిమాలో పక్కా లోకల్ సాంగ్ లో ఆడిపాడింది. ఈ సాంగ్ పెద్ద హిట్ అయింది. ఇపుడు మరోసారి అలాంటి ఊపు ఉన్న సాంగ్ లోనే చందమామ సర్ ప్రైజ్ చేయబోతోందట. త్వరలోనే ఈ ఐటం సాంగ్ ను షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కాజల్ కు తెలుగులో ఛాన్స్ లు లేకపోయినా తమిళంలో మాత్రం మూడు సినిమాలకు సైన్ చేసింది. కలువ కళ్ల కాజల్ అందివచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా సద్వినియోగం చేసుకుంటోంది. అది ఏ పాత్ర అయినా ఏమాత్రం కాదనకుండా ఒకే చెప్పేస్తోంది. అందుకే మరోసారి ఐటం సాంగ్ లో ఆడిపాడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మరి కాజల్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.. 









మరింత సమాచారం తెలుసుకోండి: