తమిళ స్టార్ ధనుష్ బాక్సాఫీస్ సెన్సేషన్ కు రెడీ అవుతున్నాడు. ఈ బక్కహీరో లుక్స్ తోనే మెస్మరైజ్ చేస్తున్నాడు.  ఊరమాస్ గెటప్ లో వావ్ అనిపిస్తున్నాడు. ధనుష్ న్యూ మూవీ సౌత్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. 
తమిళ స్టార్ ధనుష్ చూసేందుకు బక్కోడే అయిన  బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుంటాడు. పేరుకు రజనీకాంత్ అల్లుడైనా తనకంటూ ఓన్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు. అటు తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీలో కూడా ధనుష్ మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ తమిళ తంబీ అసురన్ అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ లుక్ పై సౌత్ లో ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. 


అసురన్ సినిమాలో ధనుష్ లుక్ టాక్ ఆఫ్ ది  సౌత్ గా మారింది. నేషనల్ అవార్డు విన్నర్ వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ధనుష్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషిస్తున్నాడు. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ లో ధనుష్ 80ల్లోని మీసకట్టు గెటప్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం రిలీజైన పోస్టర్ లో ఊరమాస్ గెటప్ తో షాక్ ఇచ్చాడు. 


అసురన్ సినిమా మీద కోలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. గతేడాది ఇదే కాంబినేషన్ లో వచ్చిన వడ చెన్నైలో సంచలన విజయం సాధించింది. ఈ మూవీలో మంజు వారియర్ హీరోయిన్ గా నటిస్తోంది. ధనుష్ కంటే ఐదేళ్లు పెద్దదైన మంజును క్యారెక్టర్ డిమాండ్ మేరకే తీసుకున్నట్టు తెలుస్తోంది. ధనుష్ క్యారెక్టర్ డిఫరెంట్ వేరియేషన్స్ లో సాగుతోందని తెలుస్తోంది. లుక్స్ తోనే హైప్ పెంచుతున్న ధనుష్ అసురన్ మూవీతో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి.


రజనీకాంత్ పెద్దగా అందగాడు కాకపోయినా.. డిఫరెంట్ స్టైల్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. నటనకు అందంతో సంబంధం లేదని నిరూపించుకున్నాడు. పెద్దగా డ్యాన్స్ రాకపోయినా.. వాకింగ్ స్టైల్, టాకింగ్ స్టైల్ తో ప్రేక్షకులను మెప్పించాడు. అంతేకాదు ఎందరికో రోల్ మోడల్ అయ్యాడు. సేవాగుణంతోనూ తన ప్రత్యేకతను చాటుకొని ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ధనుష్ కూడా మామయ్య రజనీకాంత్ ను ఫాలో అవుతున్నాడు. అంతగా అందగాడు కాకపోయినా.. ఆకట్టుకునే ఫిజిక్ లేకపోయినా తనదైన స్టైల్ తో ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు.  


మొత్తానికి రజనీ కాంత్ అల్లుడు ధనుష్ యూత్ కు రోల్ మోడల్ అవుతానడటంతో ఎలాంటి సందేహంలేదు. చూసేందుకు సన్నగా ఉన్నా.. మెప్పించే యాక్టింగ్ తో పాటు డ్యాన్స్ లో ఇరగదీస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇపుడు న్యూ గెటప్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.   








మరింత సమాచారం తెలుసుకోండి: