నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ల కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మించిన ఫుల్‌ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ 'నాని'స్‌ గ్యాంగ్‌ లీడర్‌'. అనిరుధ్‌ రవిచంద్రన్‌ ఈ సినిమాకు సంగీతం అందించారు. ప్రియాంక అరుళ్ మోహన్‌  హీరోయిన్‌. 'ఆర్‌ఎక్స్‌100' ఫేమ్‌ కార్తికేయ ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర పోషించారు. సెప్టెంబర్‌ 13న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ అయ్యి ఆడియన్స్‌ నుండి సూపర్‌ రెస్పాన్స్‌తో మంచి కలెక్షన్లు సాధిస్తుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ అన్నపూర్ణ సెవెన్‌ ఎకర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో....


నటుడు కార్తికేయ మాట్లాడుతూ - ''సంతోషంగా ఉంది అని చెప్పడం చాలా చిన్న వర్డ్‌. నేను ఈ మూవీ చేద్దామని డెసిషన్‌ తీసుకున్నప్పుడు రకరకాల మాటలు వినపడ్డాయి. కానీ సినిమా చేస్తున్న ప్రాసెస్‌లో నేను తీసుకున్న డెసిషన్‌ మంచిదే అని అర్ధమయింది. విల‌న్ చెయ్య‌డం వ‌ల్ల మ‌ళ్ళీ ప్రాబ్ల‌మ్ అవుతుందేమో అని కొంద‌రు అన్నారు. ఈరోజు ఇంత పెద్ద రిజల్ట్‌ని ఎక్స్‌పెక్ట్‌  చేయలేదు. నా క్యారెక్టర్‌కి ఇంత మంచి రెస్పాన్స్‌ రావడం ఒక డ్రీమ్‌లా ఉంది. ఇందులో నేను చేసిన పెర్ఫామెన్స్‌ విక్రమ్‌ సర్‌ నాకు నేర్పించి చేపించారు. నాని గారు ఈ సినిమా ముందు వరకూ నాకు ఇన్స్‌పిరేషన్‌, ఈ సినిమాతో నాకు ఒక మెంటర్‌, ఫ్యామిలీ మెంబర్‌ అయిపోయారు. మీరు చేస్తున్న ఎంకరేజ్‌ భవిష్యత్తులో ఇంకా మంచి సినిమాలు చేయడానికి ఉపయోగపడుతుంది 'అన్నారు. ఒక స్టార్ హీరో అయిన ఆయ‌న ఇంత‌లాగా మ‌రో హీరోకి ఎంక‌రేజ్ చెయ్య‌డం అనేది చాలా గొప్ప విష‌యం అని చెప్పాలి. ఇంత పెద్ద క్రేజ్ ఉన్న ఏ హీరో కూడా మ‌రో న‌టుడికి ఇంత‌లాగా ఎంక‌రేజ్ చెయ్య‌రు అన్నారు. ఈ సినిమాతో ఆయ‌న‌కంటే నాకు బాగా చాలా మంచి పేరు వ‌చ్చింది. దానికి ఆయ‌న ఎక్క‌డా కూడా బాద‌ప‌డ‌డంగాని ఎక్క‌డా అసూయ‌ప‌డ‌డం లాంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఏమీ లేవు అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: