ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ హీరోగా మెహ్రీన్, జరీన్ ఖాన్ హీరోయిన్స్ గా ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం 'చాణక్య'. స్పై యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ చిత్రంపై అటు ఇండస్ట్రీలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ హై ఎక్స్ పెక్టేషన్స్ నెలకొనివున్నాయి. అందరి అంచనాలకు రీచ్ అయ్యేవిధంగా దర్శకుడు తిరు 'చాణక్య' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో హీరో గోపీచంద్, దర్శకుడు తిరు, నిర్మాత అనిల్ సుంకర, మాటల రచయిత అబ్బూరి రవి పాల్గొన్నారు.


చిత్ర నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల క్రితం అనుకోకుండా వేరే డైరెక్టర్ కి కాల్ చేస్తుంటే తిరు నంబర్ కనిపించింది. వెంటనే కాల్ చేసి మంచి కథ ఉంటే చెప్పు అన్నాను అప్పుడు చాణక్య కథ చెప్పాడు.  స్పై బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుంది. నాకు బాగా నచ్చిన కథ. అలాగే హీరో గోపీచంద్ కి కూడా ఈ కథ బాగా నచ్చింది. అబ్బూరి రవి మంచి డైలాగ్స్ రాశారు. అలా ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అయింది. గోపీచంద్ బెస్ట్ హ్యూమన్ బీయింగ్. తను  చాలా సపోర్ట్ చేసి ఈ సినిమా త్వరగా పూర్తిచేసాడు. మళ్ళీ మళ్ళీ గోపితో సినిమాలు చెయ్యాలని వుంది. అంత కంఫర్ట్ బుల్ గా కోపరేట్ చేసైనా గోపీచంద్ కి న థాంక్స్. అలాగే డైరెక్టర్ తిరు చాలా టాలెంట్ వున్న వ్యక్తి. బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. అతనికి ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అవుతుంది. స్పై థ్రిల్లర్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకి మంచి ఎక్స్ పీరియన్స్ నిస్తుంది. ఒక వండ్రఫుల్ గొప్ప మూవీని మాకు గిఫ్ట్ గా ఇచ్చిన గోపీచంద్, తిరు కి నా థాంక్స్ అన్నారు. 


హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం తిరు ఈ కథ చెప్పాడు. నాకు బాగా నచ్చింది. కొన్ని మార్పులు చెప్పాను. అవన్నీ పర్ఫెక్ట్ గా సరిచేసి అద్భుతంగా స్టోరీ రెడీ చేసాడు. అనిల్ సుంకర గారి గురించి చాలా విన్నాను. వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఆయన అన్నీ ఎంటర్టైన్మెంట్స్ మూవీస్ చేశారు. ఇప్పుడు చాణక్య లాంటి ఓ స్పై థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మించారు.  ఎక్కడా వెనుకాడకుండా ఈ చిత్రాన్ని చాలా రిచ్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన. మళ్ళీ అనిల్ గారితో సినిమాలు చేస్తాను. అంత బాగా నాకు నచ్చిన ప్రొడ్యూసర్. వెట్రి ఫోటోగ్రఫీ బ్యూటిఫుల్ గా చేసాడు. డైలాగ్స్, సీన్స్ అన్నీ చాలా గ్రిప్పింగ్ గా ఉంటాయి. మెహ్రీన్ లవ్ ట్రాక్ సీన్స్ యూత్ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. జరీన్ ఖాన్ సెకండాఫ్ లో వసుతుంది. చాలా ముఖ్యమైన పాత్ర చేసారు. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇంట్రెస్ట్ సస్టైన్ అవుతూ ఉంటుంది. టీమ్ అంతా బాగా కష్టపడి సపోర్ట్ చేసారు. అందరం కలిసి ఓ మంచి సినిమా చేశాం. ఆడియెన్స్ బాగా రిసీవ్ చేసుకుంటారనే కాన్ఫిడెన్స్ వుంది అన్నారు..!! 

మరింత సమాచారం తెలుసుకోండి: