టీనేజ్ నుంచి ఓల్డేజ్ వరకు షకీల పేరు తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. శృంగారతారగా ఆమె సినిమాలు అంతలా ప్రేక్షకాదరణ పొందాయి. అయితే, హాట్ బ్యూటీగా ప్రేక్షకుల మనసులో చెరగని ముద్రేసుకున్న షకీలాకు కూడా రియల్ లైఫ్‌లో ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉందట.  ఒకప్పుడు షకీలా సినిమా వస్తోందంటే స్టార్ హీరోలు కూడా తమ సినిమాలను వాయిదా వేసుకునేవారంటే.. షకీలా మానియా ఏ రేంజ్‌లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఆమెపై శృంగారతార గానే ముద్ర వేసింది సినీలోకం. కానీ, తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానగణాన్ని సంపాదింకుందామె. అయితే, కొన్నేళ్లుగా ఆమె సినిమాలు తగ్గించేశారు. అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నా మునుపటిలా పూర్తిస్థాయిలో మాత్రం కాదు. 


సెన్సెషనల్ స్టార్ షకీలా  సమర్పణలో సాయిరామ్ దాసరి దర్శకత్వం లో తెరకెక్కుతోన్న చిత్రం "లేడీస్ నాట్ ఎలౌడ్" .  కె.ఆర్. ప్రొడక్షన్ పతాకంపై  రమేష్ కావలి నిర్మిస్తున్నారు. విక్రాంత్ రెడ్డి సహ నిర్మాత. ఈ చిత్ర టీజర్ ను రామానాయుడు స్టూడియోస్ లో విడుదల చేశారు. 


దర్శకుడు సాయిరామ్ మాట్లాడుతూ.. ఇదొక పూర్తిస్థాయి కామెడీ చిత్రం. షకీలా గారు రమేష్, విక్రాంత్ అన్న తో కలిసి ఈ‌సినిమా చెస్తున్నారు. ‌షకీలా ఫిలిం ఫ్యాక్టరీ పై ఈ చిత్ర  తమిళ రైట్స్ ను షకీలా గారు తీసుకున్నారన్నారు. చిత్రీకరణ పూర్తయింది. నెలాఖరులో సెన్సార్ కంప్లీట్ చేసి , వీలైనంత త్వరగా సినిమాను విడుదల చెస్తామన్నారు.


షకీలా మాట్లాడుతూ.. ఈ సినిమాను నేను చూశాను. హిలేరియస్ ఎంటర్ టైన్మెంట్ తో ఉంది. నచ్చి తమిళ్ లో సినిమాను విడుదల చెస్తున్నామన్నారు.


నిర్మాతలు మాట్లాడుతూ.. షకీలా గారితో కలిసి ఈ సినిమా చెయటం ఆనందంగా ఉంది. ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చెయటంతొ పాటు థ్రిల్ చేసెలా దర్శకుడు సాయి ఈ చిత్రాన్ని తీశారన్నారు.


ఇంకా ఈ కార్యక్రమం లో రెమో, భారతీ, గీతాంజలి తదితరులు పాల్గొన్నారు. ‌గీతా ,హనీ ,నందినీ ,భాను,హర్ష, మధు, ఆనంద్ ,మహేష్  నటిస్తొన్న ఈ చిత్రానికి
 సంగీతం: శ్రీ మిత్ర, ఎడిటింగ్: కె.ఆర్‌. స్వామి.



మరింత సమాచారం తెలుసుకోండి: