స్టార్ హీరోల సినిమాల విడుదలవుతున్నాయంటే  ఆ హీరో ల  ఫ్యాన్స్ చేసే హడావిడి మాములుగా ఉండదు. థియేటర్ల ముందు పెద్ద పెద్ద కటౌట్లు , బ్యానర్లు కట్టి తమ అభిమానాన్ని చాటు కుంటారు. ఈ సంస్కృతి ఎక్కువగా మనకు సౌత్ ఇండస్ట్రీ లో కనబడవుతుంది. అయితే  ఈ సారి తన సినిమాకు బ్యానర్లను  కట్టొద్దని అంటున్నాడు సౌత్ స్టార్ హీరో సూర్య.  అయన నటించిన  లేటెస్ట్ మూవీ కాప్పాన్  (బందోబస్త్) ఈనెల 20న విడుదలకానుంది. సూర్య కు  కోలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలిసిందే. ఈనేపథ్యంలో  తాజాగా జరిగిన కాప్పాన్ ట్రైలర్ ఈవెంట్ లో సూర్య మాట్లాడుతూ.. ఈ సినిమా కు బ్యానర్లు కట్టొద్దు,సినిమా చూసి ఎంజాయ్ చేయండి ఆబ్యానర్ల కు ఖర్చుపెట్టే డబ్బులను  ఏదైనా చారిటీ  కి ఇస్తే నేను  చాలా సంతోషిస్తాని  సూర్య తన ఫ్యాన్స్ కు విన్నవించాడు.  





ఇక  కాసేపటి క్రితం విడుదలైన కాప్పాన్ రెండవ ట్రైలర్   సినిమాఫై అంచనాలను పెంచేవిధంగా వుంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా  రంగం ఫేమ్ కెవి ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రం లో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ , బోమన్ ఇరానీ , ఆర్య  ముఖ్య పాత్రల్లో నటించగా  హారిస్ జైరాజ్ సంగీతం అందించాడు.  భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. తెలుగులో ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్  విడుదలచేయనున్నారు. కాగా ఇటీవల వరుస పరాజయాలను చవి చూసిన సూర్య  ఈ సినిమా ఫై  భారీ ఆశలు పెట్టుకున్నాడు. మరి సూర్య ఈ సినిమాతోనైనా హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: