భారత స్టార్ షట్లర్, ప్రపంచ విజేత పూసర్లపాటి వెంకట సింధు శ‌నివారం బిగ్ బాస్ షో లో సందడి చేశారు. తన కోచ్ గోపీచంద్‌తో కలిసి షో కి విచ్చేసిన సింధు హౌస్ మేట్స్‌తో కాసేపు ముచ్చటించారు. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు అంద‌రూ చాలా బాగా ఆడుతున్నార‌ని చెప్పిన ఆమె అంద‌రికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. బ‌య‌ట క్రీడ‌లు ఆడేట‌ప్పుడు ఎలాంటి ఎత్తు ప‌ల్లాలు... ఇబ్బందులు ఉంటాయో ?  హౌస్లో గేమ్ ఆడేట‌ప్పుడు కూడా అలాంటి ఇబ్బందులే ఉంటాయ‌ని.. వాటిన ఎదుర్కొని విజ‌యం సాధించాల‌ని ఆమె చెప్పారు.
అందరికీ ఇన్స్పైర్ చేయడానికి సింధును తీసుకువచ్చినట్టు నాగార్జున చెప్పారు. ఈ సంద‌ర్భంగా సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ సింధుపై సాంగ్ పాడ‌గా డ్యాన్స్ మాస్ట‌ర్ బాబా మాస్ట‌ర్ ఆ పాట‌కు డ్యాన్స్ చేసి సింధును అల‌రించారు. అనంత‌రం హౌస్‌మెట్స్ అంద‌రికి ఆమె మ‌రోసారి ఆల్ ద బెస్ట్ చెప్పి వెళ్లారు. ఇదిలా ఉంటే శ‌నివార‌మే నాగార్జున సింధుకు కారు బ‌హూక‌రించారు. 
బ్యాడ్మింటన్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు రికార్డుల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలువురు ప్రముఖులు నజరానాలు ప్రకటిస్తున్నారు.   ఈ క్ర‌మంలోనే మాజీ క్రికెటర్, హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ సింధుకు ఖరీదైన బీఎండబ్ల్యూ కారును బహూకరించారు. శవివారం మధ్యాహ్నం జరిగిన ఈ కార్యక్రమంలో సినీ హీరో అక్కినేని నాగార్జున చేతుల మీదుగా పీవీ సింధుకు కారును బహుమతిగా అందజేశారు. ఈ విష‌యాన్ని నాగార్జున సైతం హౌస్‌లో చెప్పారు.
ఇక అందరితో నాగార్జున మహానటి/నటుడు.. అంతకుమించి.. అనే ఆట ఆడించారు. అందులో పునర్నవి.. రాహుల్ ఇద్దరూ ఒకరిని ఒకరు అంతకు మించి అనే సెగ్మెంట్‌లో పెట్టుకున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేషన్ లో ఉన్న పునర్నవి, మహేష్, శిల్ప చక్రవర్తి, హిమజ, శ్రీముఖి ఐదు గురిలో హిమజ సేఫ్ జోన్ లో ఉన్నట్టు నాగార్జున ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: