టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోల మధ్య మంచి వాతావరణం ఇప్పుడిప్పుడే ఏర్పడుతుంది. ఒకరి సినిమా ఆడియో వేడుకలకు మరొకరు హాజరవుతూ ప్రమోషన్ కార్యక్రమాలకు చీఫ్ గెస్ట్ గా వస్తూ అభిమానుల మధ్య ఎటువంటి గొడవలు జరగకుండా హీరోల మధ్య మంచి వాతావరణం ఉన్నట్లు వేడుకలకు హాజరు అవుతూ మంచి సందేశాన్ని బయట ప్రపంచానికి ఇస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో అక్కినేని అఖిల్ కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాయం చేసినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. విషయంలోకి వెళితే అక్కినేని అఖిల్ వెండితెరపై ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు గడిచిన సరైన హిట్టు పడలేదు.


నాగార్జున ఇన్వాల్వ్ అయినా గాని అఖిల్ కి సరైన విజయం దక్కడం లేదు. అయితే ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అఖిల్ సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ని తీసుకోవాలని ముందునుండి అఖిల్ పట్టుబడటంతో డేట్స్ విషయంలో...ప్రభాస్ సినిమాకి డేట్స్ పూజా హెగ్డే ముందే కేటాయించడం జరిగింది అంట.


అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్...డేట్స్ విషయంలో కలుగజేసుకుని తన సినిమా కి కేటాయించిన డేట్ల నూ..అఖిల్ సినిమా కి ఒప్పించినట్లు సమాచారం. ఎందుకంటే ఇటీవల ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమా స్క్రిప్టు మొత్తం మారుతున్న క్రమంలో పూజా హెగ్డే నీ అఖిల్ సినిమా కోసం డేట్లు సర్దుబాటు చేసుకోవాలని ప్రభాస్ కన్విన్స్ చేసినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. అయితే ఈసారైనా అఖిల్ ఈ సినిమాతో హిట్ కొడతాడో లేదో అన్న టెన్షన్ లో అక్కినేని అభిమానులు ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: