శనివారం బిగ్ బాస్ ఎపిసోడ్ రసవత్తరంగా మొదలైంది. పీకల దాకా కోపం ఉందని చెప్పిన నాగార్జున అందరికి గట్టిగానే క్లాస్ పీకాడు. తప్పులు చేసిన వారిని సీరియస్ గా హెచ్చరించి, కఠినంగా ప్రవర్తించాడు. కానీ ఆ సీరియస్ నెస్  ఎక్కువసేపు నిలపలేకపోయాడు. ఇంకొద్దిసేపు అలాగే ఉంటే మరింత రక్తి కట్టేది. ఎందుకంటే బిగ్ బాస్ ని ఎదిరించిందని పునర్నవికి క్లాస్ పీకిన నాగార్జున వెంటనే ఏదో విషయంలో ఆమెకి చప్పట్లు కొట్టమనడం ఏంటో అర్థం కాలేదు.


శ్రీముఖి విషయంలో కూడా అలాగే చేశాడు. ఏరోజు కూడా ఆమె టాస్క్ సరిగా ఆడినట్టు కనబడలేదు. టాస్క్ అనౌన్స్ అవగానే ఎక్సైట్ మెంట్ తో అరుస్తుందే తప్పితే గేమ్ ఆడదు. దయ్యాల టాస్క్ లో తను గేమ్ ఆడనని చెప్పడమే కాకుండా, అవతలి వాళ్లని ఇన్ఫ్ల్యూయెన్స్ చేసిందని మందలించిన నాగార్జున మళ్ళీ ఆమె టాస్క్ బాగా ఆడతావని చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.


స్టార్టింగ్ లో ఎపిసోడ్ ని హైక్ కి తీసుకెళ్ళిన నాగార్జున ఇలా చేయడంతో ఆ సీరియస్ నెస్ తగ్గిపోయింది. మొదట్లో పీక్స్ లోకి వెళ్ళిన ఎపిసోడ్ కాస్తా మెల్ల మెల్లగా స్లో అయిపోయింది. అలా కాకుండా నాగార్జున మరింత సీరియస్ గా ఉంటే ఎపిసోడ్ సూపర్ హిట్ అయ్యుండేది. పునర్నవికి చప్పట్లు కొట్టమనడం, శ్రీముఖిని టాస్క్ బాగా ఆడుతున్నావని చెప్పడంతో వాళ్ళకి సీరియస్ గా ఇచ్చిన వార్నింగ్ లని మరిచిపోయేలా చేసింది.


నాగార్జున ఇలా చేయకుండా మొదట్లో చూపించిన సీరియస్ నెస్ ని కంటిన్యూ చేస్తే కంటెస్టెంట్స్ కి వాళ్ళు చేసిన వాటికి మరింత బాగా అర్థం చేసుకునేవారు. ఈ విషయాన్ని నాగార్జున మిస్ చేశారు. నాగార్జున ఈ పొరపాట్లు చేయకుండా ఉంటే బాగుండేదని ప్రేక్షకులు భావిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: