‘సైరా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు కౌంట్ డౌన్ మొదలవ్వడంతో ఈవారం జరగబోతున్న ఈమూవీ ఫంక్షన్ కోసం అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈమూవీని ప్రమోట్ చేస్తూ ఈమూవీలోని యాక్షన్ సీన్స్ గురించి వివరాలు తెలియచేస్తూ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమూవీ షూటింగ్ లో తన పై కోపం తెచ్చుకున్న చిరంజీవి ప్రవర్తనను వివరించాడు.

64 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక వ్యక్తి పై భారీ యాక్షన్ సన్నివేశాలు తీస్తూ ఆ వ్యక్తిచేత వేగంగా గుర్రపుస్వారీ చేయడం చాల ప్రమాదకరం అన్న విషయం తనకు తెలుసు అంటూ ఈ విషయం పై తాను చిరంజీవికి కొన్ని సూచనలు చేస్తే మెగా స్టార్ కు తన పై వచ్చిన కోపాన్ని వివరించాడు. వాస్తవానికి యాక్షన్ సీన్స్ లో తాడు కట్టి పైనుంచి కిందకు దూకే యాక్షన్ సీన్స్ ను చిరంజీవి పై తీయడం ఎందుకు అని తాను భావించి డూప్ ను పెడదాము అని అంటే చిరంజీవి కోపంతో తనకు వయసు అయిపోయింది అని అనుకుంటున్నావా అంటూ చిరంజీవి తనతో వేసిన జోక్ ను గుర్తుకు చేసుకున్నాడు. 

వాస్తవానికి చిరంజీవిని ఈ యాక్షన్ సీన్స్ విషయంలో కష్టపెట్టాలని తాను అనుకోకపోయినా చిరంజీవి తనంతట తానుగా కష్టపడటం చూసి తన మైండ్ బ్లాంక్ అయింది అని అంటున్నాడు. ఉదయం 7 గంటలకు మేకప్ వేసుకుని షూటింగ్ కు వచ్చే చిరంజీవి యాక్షన్ సీన్స్ ను తీయడానికి తాను తెల్లవారుజామున 4 గంటలకు లేచి తన కెమెరాలను సెట్ చేసుకున్న విషయాలను గుర్తు చేసుకున్నాడు.

ఈ మూవీలోని యాక్షన్ సీన్స్ హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉంటాయని చెపుతూ కేవలం ఒక కాగడా వెలుతురు మద్య గాలి పెద్దగా తగలని ప్రదేశంలో ఎటువంటి అలసట బయటపడనీయకుండా చిరంజీవి పడ్డ కష్టం తాను జీవితంలో మర్చిపోలేను అని అంటున్నాడు. 200 ఏళ్ళనాటి కథను సజీవంగా చూపించాలి అంటే ఆ సినిమాలో నటించే నటీనటుల సహాయం కావాలని ఈవిషయంలో చిరంజీవి ప్రదర్శించిన ఓర్పు తనకు ఎంతో స్ఫూర్తి అంటూ రత్నవేలు చిరంజీవి పై ప్రశంసలు కురిపిస్తున్నాడు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: