అందం అందరికీ ఉంటుంది. అది ఎక్కడ ఎపుడు ఎలా చూపించాలన్నదే టాలెంట్. అందులో పండిపోయిన నెరజాణ శ్రద్ధాదాస్. ఆమెకు సినిమాల్లో అవకాశాలు తగ్గాయి. అయినా అందం మాత్రం తగ్గడంలేదంటోంది. ఐటం బాంబు గా కూడా తన సత్తా చూపించే శ్రధ్ధ పట్ల ఎందుకో టాలీవుడ్ చిన్న చూపు చూస్తోందన్న మాట వినిపిస్తోంది. నిజానికి శ్రధ్ధ అందం, అభినయానికి చాలెంజ్ చేసే ఒక్క రోల్ కూడా ఇంతవరకూ రాలేదని కూడా అంటోంది.


ఇక శ్రధ్ధాదాస్ ఇపుడు వెబ్ సెరీస్ మీద ద్రుష్టి పెట్టింది. ఇందులో సక్సెస్ అయితే సినిమాలు అవే వస్తాయని కూడా ఆమె భావిస్తోంది. శ్రధ్ధాదాస్ తెలుగులో ఈ ఆఫీసులో అనే వెబ్ సీరీస్ లో నటిస్తోందట. అందులో ఆమె పాత్ర ఎంటి అన్నది పక్కన పెడితే తన అందాలను ఆరబోస్తూ ఇన్స్ స్ట్రాగ్రాం ని తెగ వాడేసుకుంటోంది.


తన ఒంపుసొంపులను చూపిస్తూ కొంప ముంచేస్తోంది. ఎక్కడ కుర్ర గుండెలను కొట్టాలో  అక్కడ కొట్టేందుకు శ్రధ్ధ రెడీ అయిపోతోంది. శ్రధ్ధ చూపిస్తున్న ఈ అందాల ప్రదర్శన సోషల్ మీడియానే ఘాటిక్కిస్తోంది. వామ్మో శ్రధ్ధా ఇన్ని సొగసులు ఎక్కడ దాచావు ఇన్నాళ్ళూ  అంటున్నారుట. చిలిపి నెటిజన్లు అయితే శ్రధ్ధ పెద్ద తెరను ఎపుడు ధన్యం చేస్తుందని కూడా అడుగుతున్నారట.


నిజానికి శ్రధ్ధకి కూడా కావాల్సింది అదే కదా. అందుకే తన గ్లామర్ డోస్ బాగా పెంచేసి సోషల్  మీడియాలో  పిక్స్ అలా వదులుతోంది. మరి వెబ్ సిరీస్ పట్ల తెలుగులో ఆదరణ తక్కువో లేక చిన్న చూపో తెలియదు కానీ పెద్దగా రెస్పాన్స్  లేదన్నది నిజం.  మరి ఈ ఆఫీసులో అంటూ శ్రధ్ధ లాంటి ఫిగర్ వస్తూంటే వెబ్ సిరీస్ హిట్ అవుతుందని భావిస్తున్నారు.


 ఇలా కనుక ఒకటి రెండు వెబ్ సిరీస్ హిట్లు కొడితే  ఇక చూసుకోనక్కరలేదని కూడా అంటున్నారు. బాలీవుడ్ ఇపుడు  వెబ్ సిరీస్ పూనకంతో వూగిపోతోంది. తెలుగులో కూడా అది మొదలవుతుందేమో. ఏది ఏమైనా శ్రధ్ధకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: