భార్యలు భర్తలు భర్తగానే చూడాలి.. అంతేకాని.. తండ్రిగా చూడకూడదు.. అన్నగా చూడకూడదు.  అలా చూస్తే.. భావిస్తే.. వారసులు తారుమారవుతాయి.  ఇబ్బందులు వచ్చేస్తాయి.  భర్తను భార్యలు ఇంట్లో తండ్రిని చూసినట్టుగా గౌరవంగా చోడాలని కోరుకోవడం తప్పు కాదు.  అదే భార్య భర్తను దాడి అని పిలిస్తే ఇంకేమన్నా ఉన్నదా..అసలు అలా పిలిచేవారు ఉంటారా.. అంటే ఉన్నారు.  అదెక్కడా కాదు ఇండియాలోనే.  బాలీవుడ్ నటుడు.. మోడల్ మిలింద్ ను ఆయన భార్య అంకిత కొన్వర్ దాడి అని పిస్తుందట.  


అదేంటి అని షాక్ అవ్వకండి.. అసలు విషయంలోకి వెళ్దాం.  విషయం ఏమిటంటే.. మిలింద్ సోమన వయసు ప్రస్తుతం 56.  అతడి భార్య అంకిత వయసు 28.  అంటే మిలింద్ వయసు అయన భార్య వయసు కన్నా డబుల్.  ఇంత వయసు గ్యాప్ అంటే మాములు విషయం కాదు.  చాలా కష్టం.   గ్యాప్ ఎక్కువైతే.. ఇబ్బందులు వస్తాయి.  కానీ, నటుల విషయంలో దాన్ని పెద్దగా పట్టించుకోరు.  సోహైల్, కరీనా కపూర్ మధ్య కూడా వయసు చాలా తేడా ఉన్నది.  అయినా సరే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  


సినిమా ఇండస్ట్రీలో ఇవి సహజమే అయితే.. భర్తను డాడీ అని పిలవడమే వింతగా ఉన్నది.  దానికి అంకిత చెప్పిన సమాధానం భలే తమాషాగా ఉన్నది.  మిలింద్ వయసు తన తల్లి వయసు ఒక్కటే అని.. అందుకే మిలింద్ ను డాడీ అని పిలుస్తా అని చెప్తోంది.  డాడి అని పిలిచినంత మాత్రానా తమ మధ్య వరసలు మారిపోవని అంటోంది అంకిత.  అంకిత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక పరమార్ధం కూడా ఉన్నది.  


తనను ఓ కూతురిని చూసుకున్నట్టుగా ప్రేమగా చూసుకుంటారని, తాను మిలింద్ ను తండ్రిని చూసుకున్నట్టుగా చూసుకుంటానని అందుకే తాము అలా పిలుచుకుంటామని అంటోంది. పైగా దీనికి ఆమె ఓ ఫిలాసఫీ కూడా చెప్పింది.  ప్రపంచంలో ప్రేమించడానికి వయసుతో సంబంధం లేదు.  ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ప్రేమలో పడొచ్చు.  ప్రేమ ఎప్పుడు స్వచంగానే ఉంటుంది.  అందులో ఎవరైనా సరే మునిగిపోవచ్చు అంటోంది.  అంకిత ఫిలాసఫీ వింటే.. పాపం 50 వయసులో ఉన్న వ్యక్తులు కూడా చేతిలో పువ్వు పట్టుకొని కాలేజీ చుట్టూ తిరిగేయడం ఖాయం.  


మరింత సమాచారం తెలుసుకోండి: