నాని -మనం ఫేమ్ విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన  కామెడీ రివేంజ్ డ్రామా నానీస్ గ్యాంగ్ లీడర్  నిన్న విడుదలై  యబో యావరేజ్ రివ్యూస్ ను రాబట్టుకుంది.  అయితే మాత్ టాక్ బాగుండడంతో మొదటి రోజు  చిత్రం తెలుగు రాష్ట్రాల్లో  4.50 కోట్ల షేర్ ను రాబట్టి పర్వాలేదనిపించింది. ఇక రెండో రోజు కూడా ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబట్టిందని సమాచారం. 




మొదటి రోజు నైజాం లో  ఈ చిత్రం 1.67కోట్ల షేర్ ను రాబట్టగా  రెండవ రోజు 1.48కోట్ల షేర్ తో రెండు రోజుల్లో అక్కడ 3.15కోట్ల షేర్ ను రాబట్టింది.  అలాగే ఓవర్సీస్ లో కూడా ఈచిత్రం  మంచి వసూళ్లనే రాబడుతుంది.  రెండో రోజే ఈ చిత్రం హాఫ్ మిలియన్ మార్క్ ను క్రాస్ చేసింది. అయితే గ్యాంగ్ లీడర్  బ్రేక్ ఈవెన్ కావాలంటే  1.6మిలియన్ డాలర్ల  ను రాబట్టాల్సి వుంది. మరి ఫుల్ రన్ లో ఈ చిత్రం ఆ మార్క్ ను చేరుకోవడం కష్టంగానే కనిపిస్తుంది.   





ఇక ఈరోజు ఆదివారం కావడంతో కలెక్షన్స్ డోకా ఉండదు అయితే రేపటి నుండి వీక్ డేస్ లోకి ఎంట్రీ ఇవ్వనుండండంతో ఈ సినిమా కు అసలైన పరీక్ష ఎదురుకానుంది. కేరళ బ్యూటీ ప్రియాంక అరుళ్ మెహన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో  సీనియర్ నటీమణులు  లక్ష్మి , శరణ్య ముఖ్య పాత్రల్లో నటించగా కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించాడు.  మైత్రి మూవీ మేకర్స్  నిర్మించిన ఈ చిత్రంలో ఆర్ ఎక్స్ 100ఫేమ్ కార్తికేయ విలన్ రోల్ లో నటించాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: