ప్రభాస్ భారీ బడ్జెట్ తో నిర్మించిన సాహో రిలీజై 2 వారాలు కంప్లీటయింది. నార్త్, ఓవర్సీస్ సంగతి పక్కనపెడితే.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా బ్రేక్-ఈవెన్ కాలేకపోయింది. దాంతో.. ఫ్లాప్ అని అధికారికంగా డిసైడ్ అయింది. ఈ టైమ్ లో మరోసారి "రాజమౌళి ఎఫెక్ట్" తెరపైకి వచ్చింది. రాజమౌళితో ఒక హిట్ కొట్టిన తర్వాత ఏ హీరో కెరీర్ అయినా దారుణంగా పడిపోతుంది. ఇది ఆ హీరోల గత సినిమాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. అందుకే ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ప్రభాస్ సాహో పై కూడా పడిందంటున్నారు. 

ఇప్పటివరకు రాజమౌళితో హిట్ కొట్టిన ఏ హీరో, తన నెక్ట్స్ సినిమాతో ఆ సక్సెస్ ను అందులేకపోయాడు. ఉదాహరణకు ఎన్టీఆర్...రాజమౌళితో స్టూడెంట్ నంబర్-1 తీసిన తర్వాత సుబ్బు సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు. అదే రాజమౌళితో సింహాద్రి సినిమా చేసిన తర్వాత ఎన్టీఆర్ కి ఆంధ్రావాలా రూపంలో మరో ఫ్లాప్ వచ్చింది. అంతేకాదు రాజమౌళితో యమదొంగ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఎన్టీఆర్ కి, ఆ తర్వాత కంత్రి రూపంలో మరో డిజాస్టర్ పడింది.

ఒక్క ఎన్టీఆర్ కు మాత్రమేకాదు, రాజమౌళితో సినిమా చేసిన ప్రతి హీరోది ఇదే పరిస్థితి. నితిన్ అయితే రాజమౌళితో సై సినిమా చేసిన తర్వాత చాన్నాళ్ల పాటు తేరుకోలేకపోయాడు. అటు రామ్ చరణ్ కూడా మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఆరెంజ్ లాంటి డిజాస్టర్ ఇచ్చాడు. రవితేజ, నాని లాంటి హీరోలు సైతం రాజమౌళితో సినిమాలు చేసి హిట్ కొట్టిన తర్వాత ఫ్లాపులు చూశారు. ప్రభాస్ కూడా ఈ సెంటిమెంట్ కు మరోసారి బలయ్యాడు. బాహుబలి-2 లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సాహోతో ఫ్లాప్ తెచ్చుకున్నాడు.

ఇలా చూస్తే రాజమౌళి ఎంతో కష్టపడి హీరోకి ఓ భారీ హిట్టిస్తే అదే ఆ హీరోకి షాపం లా మారుతోందని ఇండస్ట్రీలో కొంతమంది చెప్పుకుంటున్నారు. 
నిజానికి రాజమౌళి ఎఫెక్ట్ ప్రభాస్ కు కొత్తేంకాదు. గతంలో ఛత్రపతి విషయంలో కూడా ఇదే జరిగింది. జక్కన్న-ప్రభాస్ కాంబోలో వచ్చిన ఛత్రపతి సినిమా సూపర్ హిట్ అయితే...ఆ తర్వాత ప్రభాస్ చేసిన పౌర్ణమి సినిమా ఫ్లాప్ అయింది. ఇలా రాజమౌళితో సినిమాలు చేసిన హీరోలంతా ఆ వెంటనే ఫ్లాపులు అందుకోవడం ఒక సెంటిమెంట్‌లా తయారైంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: