రాజమౌళి నేషనల్ సెలెబ్రెటీగా మారిపోవడంతో అతడి పేరును ఉపయోగించుకుని అనేక మోసాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రాజమౌళి పేరును ఉపయోగించుకుని నాగార్జునకు సంబంధించిన ఒక ఫెయిల్యూర్ సినిమాను తెలివిగా తమిళంలో విడుదల చేయడమే కాకుండా ఈ మూవీ రాజమౌళి సృష్టి అంటూ జరుగుతున్న ప్రచారం చూసి కోలీవుడ్ మీడియా ఆశ్చర్య పడుతోంది. 

2011 లో వచ్చిన ‘రాజన్న’ సినిమాను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అప్పట్లో ఫెయిల్ అయింది. అయితే ఈ మూవీలోని కొన్ని యుద్ద సన్నివేశాలను నాగార్జున కోరిక మేరకు రాజమౌళి చిత్రీకరించడం జరిగింది. ఈ మూవీకి కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు. 

ఇప్పుడు ఈ మూవీని ఒక నిర్మాణ సంస్థ తమిళంలో డబ్ చేసి విడుదల చేస్తూ ‘బాహుబలి’ మేకర్స్ నుండి వస్తున్న మూవీ అంటూ రాజమౌళి కీరవాణి విజయేంద్ర ప్రసాద్ ల ఫోటోలతో పబ్లిసిటీ చేస్తున్నారు. ఈ తప్పుడు ప్రచారం చూసి ఈమూవీ నిజంగానే రాజమౌళి తీసింది అని భావిస్తూ ఈ మూవీ డబ్బింగ్ రైట్స్ కోసం తమిళనాడు మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడినట్లు టాక్. ఈ విషయాలు తెలుసుకుని అటు నాగార్జున ఇటు రాజమౌళి కూడ ఆశ్చర్య పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

నాగార్జునకు తమిళనాడులో ఏమాత్రం క్రేజ్ లేదు అయితే ‘రాజన్న’ సినిమాను తమిళనాడులో డబ్ చేస్తూ ఆ పోస్టర్స్ పై రాజమౌళి ఫోటోలు వేయడంతో అనుకోకుండా నార్జునకు కూడ తమిళనాడులో క్రేజ్ ఏర్పడటం ఆశ్చర్యం. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ లో అవకాశాలు ఇప్పిస్తాము అంటూ జరుగుతున్న మోసాలతో పాటు ఇలా పరోక్షంగా రాజమౌళి పేరును తెలుగు డబ్బింగ్ సినిమాలకు వాడుకోవడం కొత్త వ్యాపార ట్రెండ్ అనుకోవాలి. దీనితో రాజమౌళి తన ఫోటోలను ఎక్కడ వాడుకుంటున్నారో వాచ్ పెట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది..


మరింత సమాచారం తెలుసుకోండి: