నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన గ్యాంగ్ లీడ‌ర్ సినిమా ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మెగాస్టార్ చిరంజీవి గ‌తంలో న‌టించిన హిట్ సినిమా టైటిల్ కావ‌డంతో ఈ సినిమాపై ముందే మంచి హైప్ ఉంది. సినిమాకు ముందు మిక్స్‌డ్ టాక్ వ‌చ్చినా...  తొలి రోజు సాయంత్రం నుంచి పుంజుకున్న‌ట్టు బాక్సాఫీస్ క‌లెక్ష‌న్లు చెపుతున్నాయి. తొలి రోజు రూ.4 కోట్ల షేర్ రాబ‌ట్టిన గ్యాంగ్ లీడ‌ర్ రెండు రోజుల‌కు ఏపీ, తెలంగాణ‌లో రూ.8 కోట్ల షేర్ రాబ‌ట్టింది.


ఇక ఓవ‌ర్సీస్‌లో సైతం గ్యాంగ్ లీడ‌ర్‌కు నాని గ‌త సినిమాల‌తో పోలిస్తే అనుకున్న రేంజ్‌లో వ‌సూళ్లు రావ‌డం లేదు. ఇక సినిమాలో దర్శకుడు విక్ర‌మ్‌ రాసుకున్న ట్రీట్మెంట్, ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ.. కొన్ని కీలక సీన్స్ లో లాజిక్ మిస్ అవ్వడం,  సెకెండ్ హాఫ్ స్లోగా సాగుతూ అక్కడక్కడ బోర్ కొట్ట‌డం కాస్త ప్రేక్ష‌కుల‌ను ఇబ్బంది పెట్టింది.


అయితే వ‌న్ టైం వాచ్ మూవీగానే ఎక్కువ మంది చెప్ప‌డంతో గ్యాంగ్ లీడ‌ర్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నెమ్మ‌దిగా ఫిక‌ప్ అయ్యే ఛాన్సులే ఉన్నాయి. సోలోగా రావ‌డం కూడా సినిమాకు క‌లిసొచ్చింది. ఇక తొలి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ 4.51 కోట్ల షేర్‌ వసూలు చేసింది. ఇక రెండు రోజుల‌కు గ్యాంగ్ లీడ‌ర్ రూ.8 కోట్ల షేర్ ఏపీ, తెలంగాణ‌లో రాబ‌ట్టింది. ఈ సినిమాకు ఓవ‌రాల్‌గా రూ.28 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది.


గ్యాంగ్ లీడ‌ర్ ఏరియా వైజ్ 2 డేస్‌ షేర్ (రూ.కోట్ల‌లో) :


నైజాం - 3.15


సీడెడ్ - 0.97


నెల్లూరు - 0.25


కృష్ణా - 0.59


గుంటూరు - 0.72


వైజాగ్ - 1.10


ఈస్ట్ - 0.60


వెస్ట్ - 0.48
-------------------------------
ఏపీ + తెలంగాణ =  8.04
-------------------------------


మరింత సమాచారం తెలుసుకోండి: