మూన్ వాక్ ఎంటర్‌టైన్మెంట్ పతాకం పై సందీప్ చేగురి నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 'ఒక చిన్న విరామం'. సంజయ్ వర్మ, గరీమ సింగ్ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు, బిగ్ బాస్ కంటెస్టెంట్ పునర్నవి భూపాళం, నవీన్ నేని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం థ్రిల్లర్ కథాంశంతో ఉత్కంఠగా సాగుతుందని దర్శకుడు సందీప్ చేగురి తెలియచేసారు ,అలాగే 


దర్శకుడు మాట్లాడుతూ... ఈ చిత్రంలో ఒక మంచి సందేశం ఉంటుంది, అందరూ కొత్త కళాకారులతో తెరకెక్కించాము. రోడ్ ప్రయాణంలో సాగే కథ ఇది, డిఫరెంట్ కాన్సెప్ట్ తో సాగుతుందని ,ఈ నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రాబోతుందని తెలియచేసారు.।


హీరోగా పరిచయం అవుతున్న సంజయ్ వర్మ మాట్లాడుతూ... ఈ చిత్రంలో తనకు అవకాశం ఇచ్చి పరిచయం చేసిన దర్శకుడికి ధన్యవాదాలు తెలియచేసారు , హీరోయిన్ గా పరిచయం అవుతున్న గరీమ సింగ్ మాట్లాడుతూ ఈ చిత్రం లో నటించడం చాల ఆనందంగా ఉంది అని ఈ చిత్రం అందరు చూసి ఆదరించాలని కోరుకుంది।


నటుడు నవీన్ నేని మాట్లాడుతూ తనకు ఇలాంటి పాత్ర చేయటం ఇదే మొదటి సారి, ఈ చిత్రం చాల బాగా వచ్చింది అందరు తప్పకండా థియేటర్లకు వెళ్లి ఈ చిత్రం చూడాలని కోరారు।


కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన అమల అక్కినేని మాట్లాడుతూ... ఈ చిత్రం చూడడానికి ఎదురుచూస్తున్నాను. ఈరోజు విడుదల చేసిన 'నిన్ను చూడ' పాట చాలా అందంగా వినసొంపుగా ఉంది అని ప్రశంసించారు. తమ అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ &మీడియా లో చదువుకున్న దర్శకుడు సందీప్ చేగురి చాలా బాగా తీసివుంటారని తమ సంస్థ నుండి ఇలాంటి మంచి కళాకారులూ, సాంకేతికనిపుణులు చిత్రపరిశ్రమలోకి రావడం చాలా ఆనందంగా ఉంది అని తన మనసులో మాట తెలియచేసారు ।


అలాగే కారక్యమంలో నిర్మాత రాజ్ కందుకూరి కూడా ముఖ్య అతిధిగా వచ్చారు అయన మాట్లాడుతూ చిత్రం పోస్టర్ మరియు పాట చాలా బాగుందని చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు కొత్త వాళ్ళు చిత్ర పరిశ్రమకు రావాలి అని చిత్ర బృందానికి తన శుభాకాంక్షలు తెలియజేసారు । 
హాస్యనటుడు ధన్ రాజ్ మాట్లాడుతూ తన మిత్రుడు నవీన్ నటిస్తున్న ఈచిత్రం విజయవంతం అవ్వాలని చిత్ర బృందానికి తన శుభాకాంక్షలు తెలియచేసారు ।అర్జున్ రెడ్డి తో అందరికి సుపరిచితం అయిన అమిత్ మాట్లాడుతూ ఈచిత్రం తన మనసుకు చాల దగ్గరగా ఉండే చిత్రం అని చిత్రం లో నటించిన తన మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియచేసారు ।


కెమెరామెన్ రోహిత్ బచ్చు మాట్లాడుతూ చిత్రం చాల బాగా వచ్చింది అన్ని పాటలు అన్ని మంచి ప్రదేశాలలో చిత్రీకరించారని తెలియచేసారు । సంగీత దర్శకుడు భరత్ మంచిరాజు మాట్లాడుతూ ఈచిత్రంలో పాటలు చాల బాగా వచ్చాయి అని అందరు తప్పకుండా విని తమను దీవించాలని కోరారు । ఈ చిత్రం ఎడిటర్ అశ్వత్ శివకుమార్ ,శబ్ద నిపుణులు అశ్విన్ బర్డె ,సాంకేతిక అధికారి సి.వి రావు ,లైన్ ప్రొడ్యూసర్ వెంకటేష్ తదితరులు కారక్యమంలో పాలుపంచుకున్నారు ।చిత్ర పోస్టర్ మరియు మొదటిపాట ముఖ్య అతిధి సినీనటి అమల అక్కినేని విడుదల చేసారు .ఈ కారక్యమం అన్నపూర్ణ స్టూడియోస్ లోని శివ థియేటర్ లో జరిగింది


మరింత సమాచారం తెలుసుకోండి: