యాంగ్రీ హీరోగా కొన్ని సంవత్సరాలపాటు తెలుగు ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేసిన రాజశేఖర్ వరస ఫ్లాప్ ల తరువాత ‘గరుడవేగ’ మూవీతో హిట్ ట్రాక్ లోకి వచ్చిన ఆ తరువాత ఆ సక్సస్ ను కొనసాగించలేకపోతున్నాడు. నెగిటివ్ పాత్రలు చేయడానికి రెడీ అని చెపుతున్నా రాజశేఖర్ కు అవకాశాలు ఇచ్చే దర్శక నిర్మాతలు దొరకకపోవడం అతడిని మరింత నిరాశ పరుస్తున్నట్లు టాక్.

దీనికితోడు రాజశేఖర్ కుమార్తెల కెరియర్ కూడ ఏమంత ఆశాజనకంగా లేదు. ఇలాంటి వ్యతిరేక పరిస్థుతులలో కూడ రాజశేఖర్ ‘మా’ సంస్థకు 10 లక్షల విరాళం ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం మా సంస్థ నిదుల కొరతతో సతమతమవుతున్న పరిస్థితులలో ‘మా సంస్థ’ తలపెట్టిన వృద్ధ కళాకారుల పెన్షన్ స్కీమ్ ఏమాత్రం ముందుకు సాగడం లేదు.

మా సంస్థ అధ్యక్షుడు నరేశ్ కు రాజశేఖర్ కు వచ్చిన భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరుకోవడంతో ప్రస్తుతం రెండు వర్గాలుగా విడిపోయిందని వార్తలు వస్తున్నాయి. కొన్ని సున్నితమైన విషయాలలో అటు నరేశ్ ఇటు రాజశేఖర్ ఎవరికీ వారు ఇగోను ప్రదర్శించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు. 

ఇలాంటి పరిస్థితులలో రాజశేఖర్ తన ఆదిపత్యం నిలుపుకునేందుకు మా సంస్థకు 10 లక్షలు విరాళం ఇవ్వడం వెనుక పెద్ద వ్యూహాలే ఉన్నాయి అని అంటున్నారు. జరుగుతున్న ఈ పరిణామాలను పరిశీలిస్తున్న సీనియర్ నటులు కూడ రాజశేఖర్ నరేశ్ ల మధ్య ఏర్పడిన రగడను తీర్చలేక వీరిద్దరి మధ్య సద్దుబాటు చేయలేక మా రాజకీయాలు రోడ్డు ఏక్కడంతో రాజకీయ పార్టీల ఆరోపణల స్థాయిలో జరుగుతున్న ఈ వివాదాలను చూసి ఎటూ మాట్లాదలేకపోతున్నారు. మరి ‘మా’ పరిస్థితి ఎప్పుడు చక్కబడుతుందో ఆ సంస్థ సభ్యులకు కూడ తెలియని విధంగా మారింది అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: