యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుసగా సినిమాలను ఒప్పుకుంటున్నాడు. అలాగే తాను దర్శకత్వం వహించే సినిమాల తాలూకు కథలను రెడీ చేసుకుంటున్నాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన "ఈ నగరానికి ఏమైంది" సినిమా ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ క్యారెక్టర్ సీరియస్ గా ఉంటుంది కానీ దాని వల్ల సినిమాలో మంచి ఫన్ జనరేట్ అవుతుంది. ఈ సినిమాలో ఆయన  నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఆ సినిమా విజయం తరువాత ఆయన "ఫలక్ నుమా దాస్" సినిమాకు దర్శకత్వం వహిస్తు హీరోగా నటించాడు.ఈ సినిమా "అంగమలై డైరీస్" అనే మలయాళ సినిమాకి అఫిషియల్ రీమేక్. ఈ సినిమా రీమేక్ అయినప్పటికి ఆ సినిమా కథను పుర్తిగా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో మార్చడంలో సక్సెస్ అయ్యాడు. సమ్మర్ లో వచ్చిన "ఫలక్ నుమా దాస్" కమర్షియల్ గా మంచి విజయం సాధించింది.

ప్రస్తుతం 2018 లో హిందీ లో మంచి  విజయం సాధించిన రొమాంటిక్ కామేడీ ఎంటర్టైనర్ "సోను కి టిటుకి స్వీటి" సినిమా తెలుగు రీమేక్ కోసం విశ్వక్ సేన్ ను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. కార్తీక్ ఆర్యన్, సన్ని సింగ్ లు జంటగా నటించిన ఈ సినిమాకు లవ్ రంజాన్ దర్శకత్వం వహించాడు.సోను ప్రెండ్ టిటు స్వీటి ని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకుంటాడు. అయితే ఆమె ఆతన్ని  పెళ్లి చేసుకోవడానికి కారణం అతని డబ్బు.అది తెలిసిన హీరో ఆ పెళ్లి ని ఆపడానికి ప్రయత్నిస్తాడుఅదే సినిమా స్టోరి. 

ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ని సురేష్ ప్రొడక్షన్స్ దగ్గర ఉన్నయని. వారు విశ్వక్ సేన్ తో తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన చేయలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: