మెగాస్టార్ చిరంజీవి 151 వ సినిమా 'సైరా'.. మరో పదిహేను రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.  ఈ బుధవారం 'సైరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇదే ఈవెంట్ లో 'సైరా' థియోట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు సైరా బృందం ప్లాన్ చేస్తున్నారు. అంతలోపు 'సైరా' టీమ్ ఇంట్రెస్టింగ్ పోస్టర్లతో ఆడియన్సును ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద అటు మెగా ఫ్యాన్స్ లోను ఇటు ప్రేక్షకుల్లోను విపరీతంగా అంచనాలు పెరిగిపోయాయి.

ఇక తాజాగా ఈ సినిమా నుండి మరో కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో యుద్ధరంగంలో చిరు పోరాటానికి సైసై అంటున్నారు. నలుపు రంగు దుస్తులు ధరించి వీపుకు తగిలించుకున్న ఖడ్గాలను తన రెండు చేతులతో తీస్తూ ఒక ఇంటెన్స్ లుక్ ఇచ్చారు. ఈ బ్యాగ్డ్రాప్ లో చిరు వెనుక కొంతమంది కత్తులను పైకెత్తి చిరుతో పాటు శత్రువులపై పోరాటానికి రెడీ అవుతున్నారు. సాధారణమైన సినిమాల్లో కూడా ఫైట్ సీక్వెన్సులకు చిరు పెట్టింది పేరు. ఇక ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను థ్రిల్ చేసేలా ఉంటాయని ఇప్పటికే ఇన్సైడ్ టాక్. అంతేకాదు యాక్షన్ ఎపిసోడ్స్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి అద్భుతంగా తెరకెక్కించారని తెలుస్తోంది. ఈ పోస్టర్లో చిరును చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది. ఇక ఈరోజు రిలీజ్ చేసిన పోస్టర్ లుక్ ఇంతకముందు రిలీజ్ చేసిన టీజర్ లో ఒక షాట్ లో చూశాము.  
  
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా అక్టోబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది.  తొలి తెలుగు ఫ్రీడమ్ ఫైటర్ అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా పలు భారతీయ భాషలలో రిలీజ్ అవుతోంది.  'సాహో' తర్వాత ఇతర భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న సినిమా సైరా నే కావడంతో రిజల్ట్ గురించి అందరు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. 270 కోట్ల తో నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా భాటియా ప్రధాన పాత్రలు పోషించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: