టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్ గా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలితరం రేనాటి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, రవి కిషన్, అనుష్క శెట్టి, జగపతి బాబు వంటి దిగ్గజ నటులు ఎందరో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ రావడంతో సైరా టీమ్ అమితానందాన్ని వ్యక్తం చేస్తోంది. మంచి పాన్ ఇండియా ఫీల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో కూడా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేయనున్నారు నిర్మాతలు. 

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు రత్నవేలు కెమెరా మ్యాన్ గా పనిచేస్తుండగా, బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతాన్నిసమకూరుస్తున్నారు. ఇక మరొక రెండు రోజుల్లో హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఎంతో వేడుకగా జరుగనున్న ఈ సినిమా ప్రి రిలీజ్ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వివి వినాయక్, రాజమౌళి వంటి వారు ప్రత్యేక అతిథులుగా విచ్చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అదే రోజున సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. ప్రముఖ మీడియా పార్టనర్ శ్రేయాస్ మీడియా వారు ఈ వేడుక కోసం అప్పుడే భారీ స్థాయిలో ఏర్పాట్లు మొదలెట్టడం జరిగింది. అయితే ఈ ప్రి రిలీజ్ ఫంక్షన్ విషయమై నేడు ప్రచారం అవుతున్న ఒక వార్త, అందరిని షాక్ కి గురిచేస్తోంది. అదేమిటంటే, ఈ ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం ఏకంగా నాలుగు కోట్లరూపాయల వరకు ఖర్చు చేస్తున్నారట నిర్మాత రామ్ చరణ్. 

బాలీవుడ్ నుండి అమితాబ్ బచ్చన్, మోలీవుడ్ నుండి మోహన్ లాల్, కోలీవుడ్ నుండి కమల్ హాసన్ కూడా ఈ వేడుకకు హాజరవుతున్నట్లు అనధికారిక సమాచారం. అంతేకాక భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న ఈ ఈవెంట్ కోసం భారీగా ఎల్ఈడి స్క్రీన్స్ ని మరియు అతిథుల కోసం కూర్చునేందుకు అతి పెద్ద స్టేజిని కూడా ఏర్పాటు చేస్తున్నారట. మొత్తంగా సౌత్ ఇండియాలోనే అతి పెద్ద ప్రి రిలీజ్ వేడుకగా సిద్ధం అవుతున్న ఈ ఫంక్షన్ కు ఇంత భారీ ఖర్చు పెడుతున్నారంటే, సినిమాపై యూనిట్ కు ఎంతో నమ్మకం ఉండి ఉంటుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ఈ సినిమా యూనిట్ అంచనాలు ఎంతవరకు అందుకుని సైరా ఏ మేరకు సక్సెస్ సాధిస్తుందో తెలియాలంటే అక్టోబర్ 2 వరకు ఓపికపట్టాల్సిందే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: