మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో  ఎన్నికలు జరిగాయి. అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా పదవీకాలం ముగియడంతో ఎన్నిక జరిగాయి. మొత్తం 800 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. (మా) అధ్యక్ష ఎన్నిక బరిలో సీనియర్ నటుడు నరేష్ నిలుస్తుండగా… జీవితా, రాజశేఖర్‌‌తో పాటు మరికొంతమంది ఈ ప్యానల్ తరఫున పోటీ చేసి గెలిచారు. 


మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పడి ఆరు నెలలు గడించింది. ఎన్నికల సందర్భంగా 'మా' సభ్యులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నూతన కార్యవర్గం ప్రయత్నాలు చేస్తోంది. అయితే హామీల అమలు కోసం మూలధనంను తీసి ఖర్చుచేయడం సమంజసం కాదని భావించిన డాక్టర్ రాజశేఖర్... తన వంతుగా రూ. 10 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఇంతవరకూ 'మా' అసోసియేషన్ అదనపు నిధులను సేకరించే సంక్షేమ కార్యక్రమాలు జరుపుతోందని, ఈసారి కూడా అదే తరహాలో నిధులను సేకరించాలని నిర్ణయించుకున్నామని 'మా' ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డా.రాజశేఖర్ చెప్పారు. చిత్రసీమలోని అందరి సహకారంతో త్వరలోనే కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసి, నిధులను సమీకరిస్తామని తెలిపారు. డా. రాజశేఖర్ 'మా'కు పది లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం పట్ల కార్యవర్గ సభ్యులు పలువురు హర్షం వ్యక్తం చేశారు.


 మా అసోసియేష‌న్ మెంబర్స్ కి ప్రతి నెల రూ 5000 పెన్షన్ ఇవ్వడం అందరికి తెలిసిన విషయం. ఇప్పటి నుండి ‘మా’ మెంబర్ తదనంతరం, మెంబర్ యొక్క సతీమణికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) తరపున ప్రెసిడెంట్ డా.వి.కె.నరేష్‌, జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ వైస్‌ ప్రెసిడెంట్ డా.రాజశేఖర్‌, వైస్ ప్రెసిడెంట్ హేమ, అలీ, రాజారవీంధ్ర, ఉత్తేజ్‌, సురేష్ కొండేటి, అనితా చౌదరి, జయలక్ష్మి, అశోక్ కూమార్‌, టార్జాన్ తదితరులు కలిసి తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ సెక్రటరీ సుప్రియని, తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షులు ఎన్‌.శంకర్‌ని, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు సి.కల్యాణ్‌ని, తెలుగు చలన చిత్ర రచయితల సంఘం అధ్యక్షులు పరుచూరి గోపాలకృష్ణని కలిసి మన తెలుగు సినిమాల్లో తెలుగు వారికి అవకాశాలివ్వాలని, ముఖ్యంగా మా మెంబర్స్ అయ్యుండి అవకాశాలు లేని ఆర్టిస్టులను ప్రోత్సహించాలని కోరుకుంటున్నామ‌న్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: