‘సాహో’ పరాజయం తరువాత ప్రభాస్ ఏ మీడియా సంస్థకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. అయితే ప్రభాస్ అనూహ్యంగా ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వడమే కాకుండా ఆ ఇంటర్వ్యూలో బాలీవుడ్ ఇండస్ట్రీ పక్షపాత ధోరణి పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.

ఇతర భాషల హీరోలను వారు ఎంత గొప్ప వారైనా బాలీవుడ్ ప్రేక్షకులు అంతగా ఆదరించరు అని చెపుతూ ఇలాంటి పరిస్థితితులు అన్ని రంగాలలోను ఉన్నాయని కామెంట్స్ చేసాడు. ప్రతి భాషకు సంబంధించి కొందరు ప్రముఖ నటులు ఉంటారని వారిని ఆ భాషకు సంబంధించిన ప్రేక్షకులు మీడియా 20-30 సంవత్సరాలుగా ఆరాధిస్తూ వారికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వడంతో మరొక భాషకు చెందిన నటుడు బాలీవుడ్ లో రాణించడం కష్టం అన్న విషయం తనకు పూర్తిగా తెలుసు అని కామెంట్స్ చేసాడు.

అయితే ఒక భాషకు చెందిన నటుడు బాలీవుడ్ లో ఎంటర్ కాకూడదు అన్న రూల్ తనకు నచ్చదనీ అలా అనుకుంటే రాజమౌళి ‘బాహుబలి’ తీయగలిగి ఉండేవాడా అంటూ ప్రభాస్ ప్రశ్నిస్తున్నాడు. అంతేకాదు తాను తెలుగు నటుడుని అయినప్పటికీ తనను బాలీవుడ్ మీడియా బాగానే ఆదరించింది అని చెపుతూ సొంత వాళ్లకు ఇచ్చే ప్రాముఖ్యత బయట వ్యక్తులకు ఎవరు ఇవ్వరు అన్న విషయం తనకు తెలుసు అంటూ బాలీవుడ్ మీడియా తన పై ప్రవర్తించిన తీరు పై స్పందించాడు.

అంతేకాదు ‘సాహో’ ఫైలితం ఎలా ఉన్నపటికీ తన సినిమాలు బాలీవుడ్ లో కూడా విడుదల అయ్యేలా తన కృషిని కొనసాగిస్తాను అని చెపుతూ ‘సాహో’ ఫలితం పై తనకు అసంతృప్తి లేదు అన్న క్లారిటీ ఇచ్చాడు. అదేవిధంగా బాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తన కథల ఎంపిక ఉంటుంది అంటూ నటీనటులు ఒక ప్రాంతానికే పరిమితం అవ్వాలి అన్న విషయం తనకు నచ్చదు అంటూ బాలీవుడ్ లో తన ప్రయత్నాలు కొనసాగుతాయి అన్న సంకేతాలు ప్రభాస్ ఇచ్చాడు..  


మరింత సమాచారం తెలుసుకోండి: